సికిందర్ లోని అన్ని సీన్లు కోసేశారా?
ఇదిలా ఉంటే ఆడియన్స్ కు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే ఉద్దేశంలో మేకర్స్ ఈ సినిమాను చాలా బ్రీఫ్ గా ఎడిట్ చేశారట.;

గత కొన్ని సినిమాలుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సరైన హిట్ లేదు. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ హిట్ అందుకుని చాలా కాలమైంది. అయితే సల్మాన్ కొత్త సినిమాలను రంజాన్ కు రిలీజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఈ ఏడాది రంజాన్ కు కూడా సల్మాన్ తన కొత్త సినిమా సికిందర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
తమిళ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ చేసిన సికిందర్ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై సల్మాన్ భాయ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఆడియన్స్ కు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే ఉద్దేశంలో మేకర్స్ ఈ సినిమాను చాలా బ్రీఫ్ గా ఎడిట్ చేశారట. ఈ నేపథ్యంలోనే ఏకంగా 26 సీన్స్ ను కట్ చేశారట.
ఎలాగైనా సికిందర్ తో హిట్ కొట్టాలని చూస్తున్న సల్మాన్ ఖాన్ కు ఆశలకు తగ్గట్టుగానే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. గంటలోనే ఈ సినిమాకు రూ.5 కోట్ల పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం చూసి సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ లో ఇప్పటికే సికిందర్ కు రికార్డు స్థాయి బుకింగ్స్ జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఏరియాల్లో బుకింగ్స్ కాస్త స్లో గా ఉన్నప్పటికీ వీకెంట్ నాటికి ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు ఎంతో నమ్మకంగా చెప్తున్నాయి.
ఇదంతా బానే ఉన్నా సినిమాలోని ఎన్నో ట్రేడ్ మార్క్ డైలాగ్స్ ను, సీన్స్ ను మేకర్స్ ఎడిటింగ్ లో తీసేయడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 26 సీన్స్ ఎడిటింగ్ చేశాక కూడా సికిందర్ రన్ టైమ్ 135.47 నిమిషాలుందంటే మురుగదాస్ ఎంత పెద్ద సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. రెండు గంటల పదిహేను నిమిషాల నిడివి అంటే సల్మాన్ సినిమాకు పెద్ద ఎక్కువేం కాదు. ఈ రన్ టైమ్ సినిమా రిజల్ట్ పై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది.
కానీ అసలు సినిమాలోని ముఖ్యమైన సీన్స్ ను కూడా మేకర్స్ ట్రిమ్ చేయాల్సిన అవసరమేంటన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉంటుందని ఆ సీన్స్ ను ఎడిట్ చేశారా లేక అనవసరమైన కాంట్రవర్సీలను తప్పించడానికే ఆ సీన్స్ ను ఎడిట్ చేశారా లేకపోతే సెన్సార్ బోర్డ్ రూల్స్ ను పాటిస్తూ ఆ సీన్స్ ను కట్ చేశారా అనేది మాత్రం నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు.
ఏదేమైనా సికిందర్ రిలీజయ్యాక సినిమాకు అసలు సవాల్ మొదలవుతుంది. ఇన్ని సీన్స్ ట్రిమ్ చేసిన తర్వాత రిలీజవుతున్న ఫైనల్ అవుట్‌పుట్ ఆడియన్స్ ను శాటిస్‌ఫై చేస్తుందా లేదా సినిమాను మరింత గొప్పగా మారుస్తుందా అన్నది తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.