సల్మాన్ 'సికందర్' టీజర్.. ఇది అసలు మురగదాస్ సినిమానేనా?

ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ ను సల్మాన్ బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 27వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు.

Update: 2024-12-28 15:47 GMT

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సికందర్''. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ ను సల్మాన్ బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 27వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.

హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా 'సికందర్' టీజర్ ను కట్ చేసారు. సల్మాన్ ఓ డెన్ లో నడుచుకుంటూ వస్తుండగా.. మారువేషాల్లో ఉన్న కొందరు రౌడీలు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. “సునా హై బహుత్ సారే లోగ్ మేరే పీచే పదే హై.. బాస్ మేరే ముద్నే కి దేర్ హై” అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి, వాళ్ళ చేతుల్లోని గన్ తీసుకొని ఫైట్ చేస్తాడు మన సల్లూ భాయ్. 1 నిమిషం 42 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో సల్మాన్ పాత్రకు ఎలివేషన్ ఇచ్చే ఒక డైలాగ్, స్లో మోషన్ షాట్స్, యాక్షన్ సీన్ మాత్రమే చూపించారు.

డార్క్ మోడ్ లో, డిఫెరెంట్ కలర్ గ్రేడింగ్ లో సెట్ చేయబడిన 'సికందర్' టీజర్ లో సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంది. 'యానిమల్' మాదిరిగా ఓ సాంగ్ ని బీజీఎమ్ గా వినిపించే ప్రయత్నం చేసారు. ఇది ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ లుక్ బెటర్ గా ఉన్నప్పటికీ, బాడీ లాంగ్వేజ్ చూస్తే నీరసంగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. గత చిత్రాల మాదిరిగా అతని స్వాగ్ ను సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. ఇందులో సికిందర్ గా సల్మాన్ పాత్ర ఎలా ఉండబోతుందనేది శాంపిల్ గా చూపించారు. ఇందులో రష్మిక మందన్నను కానీ, ఇతర మెయిన్ క్యారెక్టర్స్ గానీ చూపించలేదు.

ఓవరాల్ గా 'సికందర్' టీజర్ సినిమాపై ఏమాత్రం హైప్ పెంచేలా లేదు. సల్మాన్ ఖాన్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, నార్మల్ ఆడియన్స్ ను మాత్రం నిరాశకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. టీజర్ అని చెప్పి మోసం చేసారని, ఇదొక కమర్షియల్ యాడ్ మాదిరిగా ఉందని.. ఫ్యాన్ మేడ్ టీజర్ లా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలోని సీన్స్ తో టీజర్ కట్ చేయకుండా.. టీజర్ కోసమే సపరేట్ గా ఓ రూమ్ లో ఈ వీడియో షూట్ చేసినట్లు ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. బాలీవుడ్ సినిమాలు ఇలా ఉండబట్టే, 'పుష్ప 2' లాంటి డబ్బింగ్ మూవీ హిందీలో రికార్డ్స్ బ్రేక్ చేస్తోందని అంటున్నారు.

ఏఆర్ మురగదాస్ చివరగా 2020లో 'దర్బార్' సినిమాని డైరెక్ట్ చేసారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన 'సికందర్' మూవీ టీజర్ ఆయన మార్క్ ను చూపించలేకపోయింది. అసలు ఎక్కడా కూడా ఇది మురగదాస్ సినిమాలా కనిపించడం లేదు. టీజర్ లో ఉన్న ఒక్క డైలాగ్ కూడా చాలా కాలంగా సల్మాన్ వెంటపడుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉద్దేశించి పెట్టినట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా రిలీజ్ కి ఇంకా టైం ఉంది కాబట్టి, హైప్ క్రియేట్ చేయడానికి మరేదైనా మంచి ప్రమోషనల్ కంటెంట్ తో రావాలని ఆశిస్తున్నారు.

''సికందర్'' సినిమాని నాడియాద్వాలా అండ్ గ్రాండ్‌సన్స్ బ్యానర్‌పై సాజిద్ నదియాద్వాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2025 ఈద్ కానుకగా థియేటర్లలో విడుదల కాబోతోంది. 'టైగర్ 3' తర్వాత సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



Full View
Tags:    

Similar News