వజ్రాల వేట‌లో త‌మ‌న్నా బిజీ!

అలాగే `సికింద‌ర్ కా ముక్ద‌ర్` అనే సినిమాలోనూ త‌మ‌న్నా న‌టిస్తోంది అన్న విష‌యం క‌న్ప‌మ్ అయింది.

Update: 2024-10-24 05:54 GMT

మిల్కీబ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ పుల్ స్వింగ్లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు లేక‌పోయినా? త‌న‌దైన బ్రాండ్ తో కొత్త ఛాన్సులు ఒడిసి ప‌ట్టుకుంటుంది. సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఓవైపు ఇలా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఐటం భామ‌గానూ దూకుడు కొన‌సాగిస్తోంది. ఇటీవ‌లే స్త్రీ -2లో ఐటం పాట‌తో మ‌రోసారి మెరిసింది. ప్ర‌స్తుతం `ఓదెల‌-2`లో న‌టిస్తోంది.

అలాగే `సికింద‌ర్ కా ముక్ద‌ర్` అనే సినిమాలోనూ త‌మ‌న్నా న‌టిస్తోంది అన్న విష‌యం క‌న్ప‌మ్ అయింది. ఇంత‌కాలం ప్ర‌చారంలో ఉన్న వార్త ఇప్పుడు ఖ‌రారైంది. చోరీకి గురైన 60 కోట్ల వ‌జ్రాలు..ఓట‌మిని అంగీక‌రించ‌ని ఇన్ స్పెక్ట‌ర్ అనే వ్యాఖ్య‌ల్ని జోడిచింది. దీంతో ఈ క‌థ వ‌జ్రాల బ్యాక్ డ్రాప్ లో సాగుతుంద‌ని తెలుస్తోంది. ర‌హ‌స్యం, నేరం, సంక‌ల్పం లాంటి అంశాల‌తో క్రైమ్ డ్రామా నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని నీర‌జ్ పాండే తెర‌కెక్కిస్తున్నారు.

అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని థియేట‌ర్ లో కాకుండా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా త‌మ‌న్నా సినిమాల ప‌రంగా బిజీగానే ఉంది. అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తెలుగు, హిందీల్లో కొన్ని వెబ్ సిరీస్ లు చేసిన అమ్మ‌డు ప్ర‌స్తుతం `డార్లింగ్ పార్ట‌న‌ర్స్` అనే సిరీస్ చేస్తోంది. ఇక్క‌డ అమ్మ‌డు మ‌రింత బోల్డ్ పెర్మార్మెన్స్ తో అద‌ర గొడుతుంది.

త‌మ‌న్నా బ్యూటీని వెబ్ సిరీస్ లు ప‌ర్పెక్ట్ గా హైలైట్ చేస్తున్నాయి. సినిమాల్ని మించి ఇక్క‌డ మ‌రింత ఫేమ‌స్ అవుతుంది. అలాగే వ్య‌క్తిగ‌తంగానూ అమ్మ‌డు సాపీగా సాగిపోతుంది. విజ‌య్ వ‌ర్మ‌తో కొంత కాలంగా ప్రేమ‌లోనూ మునిగి తేలుతోంది. ఈ విష‌యంలో త‌మ‌న్నా కొంత ఒత్తిడిని ఎదుర్కుంటుంది. వివాహం ఎప్పుడు అంటూ త‌మ‌న్నా కి రోజూ వేల‌ల్లో పోస్టులు పాస్ అవుతున్నాయి.

Tags:    

Similar News