వైశాలి, చందమామ నటి గుర్తుందా.. ఇపుడు ఎలా ఉందంటే .

మేకింగ్ విధానంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హీరోయిన్లను ఎలా చుపోస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Update: 2024-09-01 09:30 GMT

మేకింగ్ విధానంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హీరోయిన్లను ఎలా చుపోస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం మాత్రమే కాకుండా వారిలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ను తెరపై మరింత అందంగా హైలెట్ చేస్తాడు. అందుకే అప్పట్లో స్టార్ హీరోయిన్స్ సైతం ఆయన సినిమాల్లో ఒక్క చాన్స్ దొరికోతే చాలని అనుకునేవారు.

ఇక ప్రతి పాత్రలో, ప్రతి నటిలో కొత్తదనాన్ని చూపించేందుకు కృషి చేసే కృష్ణవంశీ తీసిన "చందమామ" సినిమా కూడా అలాంటి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సింధు మీనన్ చేసిన రాణి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సింధు మీనన్, నవదీప్, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

అయితే, సింధు మీనన్ పాత్రలో గడుసు, చిలిపితనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పల్లెటూరి అమ్మాయిగా సింధు మీనన్ నేచురల్ యాక్టింగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. నిజానికి కాజల్ కంటే ఎక్కువ సీన్స్ సింధుకే కేటాయించారు, ఆ పాత్రకు కావాల్సిన బోల్డ్‌ యాటిట్యూడ్‌ అంతా సింధులో నిండుగా చూపించారు కృష్ణవంశీ.

సింధు మీనన్‌కు సినిమా కెరీర్ తొలినాళ్లలో మంచి గుర్తింపు లభించింది. మొదట భద్రాచలం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, తరువాత త్రినేత్రం లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. వైశాలి సినిమా కూడా మరో బిగ్ హిట్ అని చెప్పవచ్చు. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించిన సింధు, అన్ని ఇండస్ట్రీల్లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, చందమామ తర్వాత ఆమె బిజీ అవుతుందనుకున్న తరుణంలో, పెద్దగా అవకాశాలు రాలేదు.

ఇక 2010లో డొమినిక్ ప్రభు అనే ఐటీ ప్రొఫెషనల్‌ను వివాహం చేసుకున్న సింధు, యూకేలో స్థిరపడి కుటుంబ జీవితం గడుపుతోంది. సినీ కెరీర్‌కు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన కుటుంబం ఫొటోలతో అభిమానులకు కనెక్ట్ అవుతూ ఉంటోంది. ఈ మధ్యనే ఆమె యాత్రల అనుభవాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. సినిమాల్లో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న సింధు మీనన్ కు ఒక పాప, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తరహాలో ఆమె సినిమాలకు రావడానికి ఆసక్తి చూపుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News