మోక్షు బాబు డెబ్యూ.. బాలయ్య డైరెక్టర్ క్లారిటీ ఇలా!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మూవీతో మోక్షు ఎంట్రీ ఇస్తారని.. కొద్ది రోజుల క్రితం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.;

Update: 2025-04-04 06:12 GMT
మోక్షు బాబు డెబ్యూ.. బాలయ్య డైరెక్టర్ క్లారిటీ ఇలా!

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ.. డెబ్యూ మూవీపై ఎప్పటికప్పుడు అటు సినీ వర్గాల్లో.. ఇటు సోషల్ మీడియా చర్చ జరుగుతూనే ఉంటుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మూవీతో మోక్షు ఎంట్రీ ఇస్తారని.. కొద్ది రోజుల క్రితం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

ఆ తర్వాత కొద్ది రోజులకే పూజా కార్యక్రమాలు జరుగుతాయని వార్తలు వచ్చాయి. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య బాలయ్య.. ఓ కార్యక్రమంలో స్పందించారు కూడా. ప్రశాంత్ వర్మ మూవీతోనే మోక్షు డెబ్యూ అని తెలిపారు.

అదే సమయంలో బాలయ్య సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ.. హీరోగా ఎంట్రీ ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయంపై ఆదిత్య 369 డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు స్పందించారు. తమ మూవీ సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసని ఆయన తెలిపారు.

అందుకే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఆదిత్య 369 సీక్వెల్ తో బాలయ్య.. మోక్షును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారని వెల్లడించారు. కానీ అది కుదరలేదని చెప్పారు. అయితే ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని మాత్రం బాలయ్య అంటుంటారని పేర్కొన్నారు. ఆయనే సినిమాకు దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది.

1991లో బాలయ్య లీడ్ రోల్ లో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ ఆదిత్య 369. ది టైం మెషీన్‌ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన ఆ సినిమా.. టైమ్ ట్రావెల్ స్టోరీతో థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ మూవీలో బాలయ్య సరసన హీరోయిన్‌ గా విజయశాంతి అనుకుంటే.. మోహిని యాక్ట్‌ చేసింది.

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. శ్రీరామ్, వి.ఎస్‌.ఆర్‌ స్వామి, కబీర్‌ లాల్‌ లాంటి అద్భుతమైన టెక్నీషియన్లు ఛాయాగ్రాహకులుగా వర్క్ చేశారు. అయితే ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మూవీ. మంచి రెస్పాన్స్ కూడా అందుకుంటోంది. మరి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో.. ఎవరు నటిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News