ఓ ఇంటివాడైన 'బుట్ట బొమ్మా' సింగ‌ర్

పెళ్లికి సంబంధించిన అంద‌మైన ఫోటోల‌ను వారు షేర్ చేసారు

Update: 2025-01-02 15:12 GMT

'బుట్ట బొమ్మా' పాట‌తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గాయ‌కుడు ఆర్మాన్ మాలిక్. అత‌డు తెలుగులో ఫేమ‌స్ సింగ‌ర్. చాలా కాలంగా తెలుగు సినిమాల‌కు పాడుతున్నాడు. కానీ అల వైకుంఠ‌పుర‌ములోని చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ బుట్ట బొమ్మాతో అత‌డి గురించి దేశంలోని ప్ర‌తి కార్న‌ర్ కి తెలిసింది. ఆర్మాన్ ఇప్పుడు ఓ ఇంటివాడ‌య్యాడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్నా ష్రాఫ్ ను 2 జనవరి 2025న పెళ్లాడాడు. పెళ్లికి సంబంధించిన అంద‌మైన ఫోటోల‌ను వారు షేర్ చేసారు. 'తు హాయ్ మేరా ఘర్' అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది.


ఇన్ ఫ్లూయెన్స‌ర్‌తో గాయ‌కుడి లైఫ్ కొత్త సంవ‌త్స‌రంలో కొత్త‌గా మొద‌లైంది! అంటూ కొత్త అధ్యాయంలో అడుగుపెట్టిన ఆర్మాన్- ఆష్నాల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అర్మాన్ త‌న ఇన్ స్టాలో పెళ్లి ఫోటోల‌ను షేర్ చేయ‌గా వాటిని జోరుగా వైర‌ల్ చేసారు. పెళ్లి ఆ ఇద్ద‌రి మోములో అమితానందాన్ని ఆవిష్క‌రించింద‌ని ఫోటోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఆష్నా చాలా కాలంగా త‌న స్నేహితురాలు. వారిది ప్రేమ వివాహం కావ‌డంతో ఆ జోష్ వారిలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.


ఆర్మాన్ తెలుగులో అర‌వింద స‌మేత‌, తొలి ప్రేమ‌, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఆప‌రేష‌న్ వాలెంటైన్, క‌మిటీ కుర్రాళ్లు వంటి చిత్రాల‌కు చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ పాడారు. అర‌వింద స‌మేత‌లో అన‌గ‌న‌గా... పాట‌ను ఆల‌పించింది ఆర్మాన్. అజార్, M.S. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ స‌హా బాలీవుడ్ లో చాలా హిట్ పాట‌ల‌ను పాడాడు.

Tags:    

Similar News