38 భాష‌ల్లో 5000వేల పాటలు!

సంగీత ప్ర‌పంచంలో ప్ర‌ముఖ గాయ‌ని హేమ‌ల‌త‌ది ఓ అద్భుతమైన ప్ర‌యాణం.

Update: 2024-11-25 13:30 GMT

సంగీత ప్ర‌పంచంలో ప్ర‌ముఖ గాయ‌ని హేమ‌ల‌త‌ది ఓ అద్భుతమైన ప్ర‌యాణం. 13 ఏళ్ల‌కే త‌న గాత్రంతో మెప్పించారు. 38 భాష‌ల్లో ఐదు వేల‌కు పైగా పాట‌లు పాడిన చరిత్ర ఆమె సొంతం. హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, ఒడియా, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, ప్రాకృతం వంటి ప్రధాన భాషల్లోనే కాకుండా భోజ్‌పురి, బ్రజ్, మార్వారీ, అవధీ, బుందేలి, మైథిలి, డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, హరియాణ్వీ, నేపాలీ, గార్వాలీ, కుమావీ, చంబయాలీ, బిలాస్‌పురి వంటి అనేక స్థానిక భాషల్లోనూ పాటలు పాడారు.

వీటితో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, డచ్, జులు, మారిషస్ క్రియోల్, సిరాయికి, ముల్తానీ భాషల్లోనూ పాటలు పాడడం విశేషం. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలు, ఆధ్యాత్మిక గీతాలు, భావ గీతాలు, జానపద గీతాలు, గజల్స్ ఒకటేమిటి అన్ని రకాల పాటలూ ఆమె గాత్రం నుంచి జాలువారాయి. హిందీలో ఆమె ఏసుదాసుతో కలిసి పాడిన పాటలు సూపర్‌హిట్‌లు. 9 నెలల గర్భంతో ఉన్న‌సమ‌యంలో కూడా పాటలు పాడిన ఏకైక గాయని హేమ‌ల‌త‌.

`నదియా కే పార్` చిత్రం కోసం ఆమె తాను 9 నెలల గర్భంతో ఉన్నప్పటికీ ‘కోన్ దిశా మే లే కే చలా రే బతూహియా’ అనే పాట పాడారు. ఆ పాట హిందీ సినీ సాహిత్యంలో ఎంత పాపులరో అయింది. తాజాగా ప్ర‌ముఖ పాత్రికేయుడు, ర‌చ‌యిత అర‌వింద్ యాద‌వ్ `హేమ‌ల‌త` జీవితాన్ని పుస్త‌క‌రూపంలో తీసుకొచ్చారు. `ద‌స్తాన్ హేమ‌ల‌త` అనే పేరుతో పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఢిల్లీలోని సాహితీ ఆజ్ త‌క్ వేదిక‌గా ఆవిష్క‌రించారు.

`హేమ‌ల‌త భాష‌, యాస‌తో సంబంధం లేకుండా పాట‌లు పాడారు. ల‌తా మంగేష్క‌ర్ డేట్స్ దొర‌క‌ని స‌మ‌యంలో అంతా హేమ‌ల‌త‌నే సంప్ర‌దించేవారు. 70-80 కాలంలో సౌత్ ఇండ‌స్ట్రీ పాట‌ల‌న్నింటి హిందీలో డ‌బ్బింగ్ పాట‌ల్ని అత్య‌ధికంగా ఆమె పాడారు. పాట కోసం ప్రాణం పెట్టేవారు. తొమ్మిది నెల‌ల గ‌ర్బంలోనూ పాట పాడి చ‌రిత్ర సృష్టించారు` అని అర‌వింద్ అన్నారు.

Tags:    

Similar News