పవన్ కి చేతనైతే సాయం చేద్దాం! శైలజ
పవన్ కళ్యాణ్ స్వయంగా దుర్మమ్మ మెట్లను కడగడం...పసుపు కుంకుమ రాయడం ఎంత సంచనలమైందో కూడా తెలిసిందే.
ఏపీని ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే అంశాన్నితెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే తమ కూటమి ప్రభుత్వం తరుపున అంతా మద్దతు ప్రకటించారు. అభిమానులు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున పవన్ పోరాటం వెనుక నిలబడ్డారు. ప్రతిగా విమర్శలు కూడా ఎదుర్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా దుర్మమ్మ మెట్లను కడగడం...పసుపు కుంకుమ రాయడం ఎంత సంచనలమైందో కూడా తెలిసిందే.
అలాగే పవన్ కి వ్యతిరేక వర్గం అంతే ధీటుగా సోషల్ మీడియాలో ఎటాకింగ్ దిగింది. వైకాపా నాయకుల మాటలతో సన్నివేశం మరింత వెడేక్కింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్లో గాయని ఎస్పీ శైలజ ఈ వివాదంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ గురించి స్పందించమని అమెని మీడియా ప్రతినిధి కోరగా..ఆమె ఏమాత్రం వెనకడుగు వేయలేదు .`ఎవరి ధర్మం వాళ్లకు ముఖ్యం. ఆయన ఇది నా ధర్మం అనుకోని చేస్తున్నారు.
మధ్యలో మనం వేలెత్తి చుపించాల్సింది ఏం లేదు. ఆయన ఇలా చేస్తే నా స్వామికి ప్రక్షాళన అవుతుందని భావించి చేస్తున్నారు. ఆయన నమ్ముతున్నారు. దాంట్లో తప్పేముంది? చేతనైతే సహాయం చేద్దాం? లేకపోతే దూరం నుంచి చూడండి. ఇందులో వివాదాలు లేవు. అంతా దేవుడు చూసుకుంటాడు` అని అన్నారు. దీంతో శైలజ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలిచినట్లు అయింది.
సాధారణంగా వివాదాస్పద అంశాలపై శైలజ ఎప్పుడూ స్పందించరు. అడిగినా స్కిప్ కొట్టి వెళ్లిపో తుంటారు. అలాంటి శైలజ కూడా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెకి మద్దతుగా పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.