అందమైన సింగర్ కూడా ఓ ఇంటిదవుతోంది!
సింగర్ హారికా నారయణ్ త్వరలో పెళ్లిపీఠలెక్కబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తన స్నేహితుడు పృధ్వీనాధ్ వెంపటితో జీవితాన్ని పంచుకుంటున్నట్లు ఇన్ స్టా ద్వారా రివీల్ చేసారు.
సింగర్ హారికా నారయణ్ త్వరలో పెళ్లిపీఠలెక్కబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తన స్నేహితుడు పృధ్వీనాధ్ వెంపటితో జీవితాన్ని పంచుకుంటున్నట్లు ఇన్ స్టా ద్వారా రివీల్ చేసారు. వారిద్దరి మధ్య ఉన్న ఏడేళ్లగా ఉన్న స్నేహం ప్రేమగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి పింది.'ఏడేళ్లగా ఉన్న అద్భుతమైన స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాం. ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మా మధ్య ఉన్న అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాం.
కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం' అంటూ నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది హారికా నారాయణ్. ఉంగరం మార్చుకుంటోన్న ఫోటోని షేర్ చేసారు. కానీ భర్త వివరాలు మాత్రం రివీల్ చేయ లేదు. హారికకి చిన్ననాటి నుంచి పాటలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే గాయనిగా మారారు. తొలుత నిహారిక కథానాయికగా నటించిన 'సూర్యకాంతం'తో ప్లేబ్యాక్ సింగర్‌గా మారారు. ఆ తర్వాత 'నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్ రోజ్)' సాంగ్‌తో యువతకు కనెక్ట్ అయింది.
హస్కీ వాయిస్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. 90 సెకెన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్ ని అనుకరిస్తూ చేసిన ఆల్బమ్ తో వరల్డ్ వైడ్ గా అందర్నీ ఆకర్షించింది. అలాగే విజయ్ హీరోగా నటించిన 'వారసుడు' చిత్రంలో తలపతి పాటతో ఇండియాలో మరింత ఫేమస్ అయింది. అలాగే మహేష్ నటించిన 'సర్కారువారి పాట' లో టైటిల్ రాప్ కూడా ఆలపించింది. రవితేజ నటించిన 'రావణాసుర' ఆమె పాడిన అంథెమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. మహేష్ అంటే అభిమానం. ఆ కారణంగా దగ్గర నుంచి చూడొచ్చని 'బ్రహ్మోత్సవం'లో ఛాన్స్ రావడంతో నటించింది.
హారికది తూర్పుగోదావరి జిల్లా రాజోలు. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి దగ్గర బంధువు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ఉత్తరాదిలో పెరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలనుకుంది. కానీ తాను కొరుకున్న ఫ్యాషన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో సింగర్ గా ప్రయాణం మొదలు పెట్టి సక్సెస్ అయింది.