34 ఏళ్ల గాయని సంపద 8343 కోట్లు
34 వయసుకే కళ్లు భైర్లు కమ్మే సంపదతో ఆశ్చర్యపరుస్తోంది ప్రముఖ గాయని.
34 వయసుకే కళ్లు భైర్లు కమ్మే సంపదతో ఆశ్చర్యపరుస్తోంది ప్రముఖ గాయని. మూడు పదుల వయసులో బిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. ఇప్పుడు అక్షరాలా తన సంపదల విలువ 8343 కోట్లు.. అంతకుమించి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఫీట్ వేసిన గాయని ఎవరు? దీనిని ఎలా సాధించగలిగింది? అంటే.. దానికి సమాధానం ఇక్కడ ఉంది.
తాజాగా ఫోర్బ్స్ రిలీజ్ చేసిన జాబితా ప్రకారం... 34 ఏళ్ల అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ బిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. సింగర్‌గా, పాటల రచయితగా, దర్శక నిర్మాతగా మ్యూజిక్ రంగంలో విశేషమైన కృషి చేస్తున్న టేలర్ స్విఫ్ట్‌ని ప్రపంచవ్యాప్తంగాప్రేమించే ఆరాధించే అభిమానులున్నారు. స్విఫ్ట్ అధికారికంగా బిలియనీర్ క్లబ్‌లో సభ్యురాలిగా ఖరారైంది. ఫోర్బ్స్ టేలర్ స్విఫ్ట్ సంపద ఒక బిలియన్ డాలర్లకు మించి ఉందని పుకార్లను ధృవీకరించింది.
తన పాటలు ప్రదర్శనల ఆధారంగా పది-అంకెల హోదాను సాధించిన మొదటి సంగీత విద్వాంసురాలు అని ఫోర్బ్స్ పేర్కొంది. స్విఫ్ట్ రికార్డ్-బ్రేకింగ్, ఐదు-ఖండాల ఎరాస్ టూర్ 1 బిలియన్ డాలర్ ఆదాయాన్ని అధిగమించిన మొదటి పర్యటన. తాజా కథనాల ప్రకారం పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ తన బ్లాక్‌బస్టర్ టూర్ కచేరీలు, తన మ్యూజిక్ కేటలాగ్ విలువ ..అలాగే రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో ద్వారా $1.1 బిలియన్ల సంపదను ఆర్జించింది.
టేలర్ స్విఫ్ట్ నికర ఆస్తి విలువ
సంగీతం, కచేరీలు & ఎండార్స్‌మెంట్‌లు, ఆల్బమ్ అమ్మకాలు, టూరింగ్, సరుకులు, వాటి ఎండార్స్‌మెంట్‌ల ద్వారా తనకు ఇంత పెద్ద మొత్తంలో నికర ఆదాయం సమకూరింది. ఎరాస్ టూర్ అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన పర్యటనగా అవతరించడంతో ఆమె కచేరీలకు డిమాండ్ పెరిగింది. టూర్ల ద్వారా ఆదాయం సుమారు 1.039 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా.
టేలర్ స్విఫ్ట్ ఆకట్టుకునే రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ చుట్టూ సుమారు 150 మిలియన్ డాలర్ల విలువైన 5 ఆస్తులను కలిగి ఉంది. 2009లో డౌన్‌టౌన్ నాష్‌విల్లేలో 2 మిలియన్ డాలర్లకు ఒక కాండోను కొనుగోలు చేసింది. అదే సంవత్సరం అక్కడే ఉన్న 1-BR యూనిట్‌ను దాదాపు $400kకి కొనుగోలు చేసింది. నేడు ఈ యూనిట్ల విలువ కలిపి 4 మిలియన్ డాలర్లు. 2011లో నాష్‌విల్లే శివారులో ఆరు ఎకరాల స్థలంలో 8,000 చదరపు అడుగుల భవనంపై 2.5 మిలియన్ డాలర్లను వెచ్చించింది. అది ఈరోజు కనీసం 6 మిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది.
రోడ్ ఐలాండ్‌లోని స్విఫ్ట్ ఇల్లు - హై వాచ్ ను 2013లో 17.75 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది 11,000 చదరపు అడుగుల భవనం. నేడు ఎనిమిది పడక గదులు, పదిన్నర అడుగుల స్నానపు గృహంతో ఉన్న దీని విలువ సుమారు 30 మిలియన్ డాలర్లు. టేలర్ న్యూయార్క్ నగరంలో దాదాపు 50 మిలియన్ డాలర్ల విలువైన అపార్ట్‌మెంట్‌లను కలిగి ఉన్నారు. NYCలో మొదటి రియల్ ఎస్టేట్ కొనుగోలు 2014లో ట్రిబెకాలో ఒక పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేసింది. ఈరోజు దాని విలువ 20 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. 2017లో డూప్లెక్స్ పక్కన ఉన్న 100 ఏళ్ల నాటి నాలుగు అంతస్తుల పెంట్‌హౌస్‌ను 12.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 2018లో తన అసలు భవనంలోని మరో కాండో కోసం 10 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.
అక్టోబర్ 2023లో AMCతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఒప్పందంతో AMC ప్రత్యేక పంపిణీదారుగా చేరింది. టిక్కెట్ విక్రయాల నుండి టేలర్ 50 శాతం సంపాదించారు. కచేరీ చిత్రం సుమారు 260 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. టేలర్‌కు దీని వల్ల 130 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఫిబ్రవరి 2024లో టేలర్ ఎరాస్ టూర్ చలనచిత్రం ప్రత్యేక ప్రసార హక్కులను 75 మిలియన్ డాలర్లకు డిస్నీకి విక్రయించారు. దీంతో ఆమె 205 మిలియన్ డాలర్లను అధిగమించింది.
2024 బిలియనీర్లు
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2,781 మంది బిలియనీర్లు రికార్డు స్థాయిలో మొత్తం $14.2 ట్రిలియన్ల మేర ఆస్తిని కలిగి ఉన్నారు. వీరిలో గత ఏడాది కాలంలో 265 మంది ఈ జాబితాలోకి ప్రవేశించారు. USలో అత్యధిక బిలియనీర్లు ఉన్నారు. వీరి సంఖ్య - 813. సంయుక్త నికర విలువ $5.7 ట్రిలియన్లు. 1.7 ట్రిలియన్ డాలర్ల విలువైన 473 మంది బిలియనీర్లతో (హాంకాంగ్‌లోని వారితో సహా) చైనా రెండవ స్థానంలో ఉంది. 200 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది.