1000 రూపాయలకు పాడే సింగర్లున్నారు!
3000 వేలు, 2000 వేలు అంటూ బేరాలాడుతారు. ఇంకొంత మంది అవకాశం కోసం 1000 రూలకే పాడతారు' అని తెలిపింది.
సినిమా కష్టాలంటే ఎక్కువగా నటులు, దర్శకుల కష్టాలే హైలైట్ అవుతుంటాయి. అవకాశాల కోసం ఆఫీస్ లు చుట్టూ తిరిగడం...వస్తుంది అనుకున్న అవకాశం రాకపోవడం...చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మరోకరకి వెళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు ప్రయత్నించే వారికి ఎంతో బాధ కలుగుతోంది. సంవత్సరాలు గడుస్తున్నా? అవకాశం రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంలో మగ్గిపో వడం... అయినా సినిమా ధ్యాశ తప్ప మరో ఆలోచన లేకుండా ఉండటమే ఇక్కడ ముందుకు నడిపించే అంశం.
ఏదో ఒకరోజు ఛాన్స్ వస్తుందనే ఆశ మాత్రమే నడిపిస్తుంది. మరి గాయకుల పరిస్థితి ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది? వాళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయంటే? గాయని ప్రణవి చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. గాయకుల పరిస్థితి కూడా అత్యంత ఘోరంగా ఉంటుంది అన్న సంగతి అర్దమవుతుంది. 'ఓ స్టార్ హీరో సినిమాకి పాట పాడాను. సంగీత దర్శకుడు పేరున్న వాళ్లే. కానీ ఆ సినిమాకి నేను తీసుకున్న పారితోషంక ఎంతో తెలుసా? అక్షరాలు 5 వేల రూపాయలు మాత్రమే.
గాయనిగా ఎన్నో సినిమాలకు పాటలు పాడాను. ఎంతో అనుభవం ఉంది. ఇలా ఒక సినిమాకి కాదు చాలా సినిమాలకు జరిగింది. నా కెరీర్ లో అత్యధికంగా పారితోషికం తీసుకుంది సినిమా పాటలకు కాదు...ఓ సీరియల్ పాటకి. రమ్యకృష్ణ నటించిన ఓ సీరియల్ కి పాడాను. అందుకుగాను 30వేలు అచ్చారు. అదే నేను తీసుకున్న అతిపెద్ద పారితోషికం. ఇక్కడ ఎలా ఉంటుందంటే? ఎంత గుర్తింపు ఉన్నా ఎవరు? తక్కువ డబ్బులకి పాడతారా? అని చూస్తారు. కొంతమంది అవకాశం కోసం ఉచితంగానే పాడతామని ముందుకొస్తారు.
అలాంటప్పుడు ప్రీగా వస్తే పోయేదేముందని వాళ్లతో పాడించుకునే వాళ్లు కొంత మంది అయితే, ఆ పనికి డబ్బులిచ్చి పంపిచేవారు మరికొంత మంది. నువ్వు కాకపోతే ఇంకొకరు...నాకు సింగర్లు దొరకరా? అన్న ధోరణి కనిపిస్తుంది. మా జనరేషన్ సింగర్లలో ఇది ఎక్కువగా ఉంది. సీనియర్ సింగర్లు వేరు. వాళ్ల బిజీ వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ల పరిస్థితే దారుణంగా ఉంటుంది. 3000 వేలు, 2000 వేలు అంటూ బేరాలాడుతారు. ఇంకొంత మంది అవకాశం కోసం 1000 రూలకే పాడతారు' అని తెలిపింది.