రియ‌లైజ్ అయిన అక్కాచెల్లెళ్లు!

త‌ల్లిదండ్రులు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయిన వారైతే! పిల్ల‌ల ఆలోచ‌న‌లు హైలోనే ఉంటాయి

Update: 2023-11-17 05:40 GMT

త‌ల్లిదండ్రులు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయిన వారైతే! పిల్ల‌ల ఆలోచ‌న‌లు హైలోనే ఉంటాయి. జీవితంలో అలా ఉండాలి..ఇలా ఉండాల‌ని ఫ్యాంట‌సీ కోర్కెలు బ‌య‌ట పెడుతుంటారు. అవి కాస్త అతిగానూ అతిగానూ ఉంటాయి. కొంద‌రిలో సింప్లిసిటీ అనేది క‌నిపించ‌డ‌దు. హ‌డావుడి..ఆర్బాటం ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. వాటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.

తెలిసో..తెలియ‌కో చేసినా మీడియాలో అవి నెగిటివ్ గానే ప్రొజెక్ట్ అవుతుంటాయి. కొన్ని అనుభ‌వాలు త‌ర్వాత రియ‌లైజ్ అవుతుంటారు. తాజాగా టాలీవుడ్ లో అక్కాచెల్లి మ‌ధ్య అలాంటి రియ‌లైజేష‌న్ క‌నిపిస్తుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చేముందు మా రేంజ్ టాలీవుడ్ కాదు.. బాలీవుడ్ అన్నారు. అక్క‌డా ప్ర‌త్యేకంగా కొంత‌మంది ఫేమ‌స్ డైరెక్ట‌ర్ల పేర్లు చెప్పారు. పెద్ద నిర్మాణ సంస్థ‌ల‌తో ప‌నిచేయాలని..చేస్తామ‌ని ఆ విధ‌మైన కాంటాక్ట్స్ త‌మ‌కు ఉన్నాయ‌ని చాలా కాన్పిడెంట్ గా చెప్పారు.

కానీ ఇప్పుడు స‌న్నివేశం అందుకు భిన్నంగా క‌నిపిస్తుంది. టాలీవుడ్ లోనే స‌రైన అవ‌కాశాలు రాక ఇబ్బంది ప‌డుతున్నారు. ఇద్ద‌రి డెబ్యూలు ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అటుపై చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీంతో అక్కా చెల్లిలో తాజాగా చాలా మార్పులు చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏవేవో క‌ల‌లు క‌న‌డం కంటే వ‌చ్చిన సినిమాలు చేసుకుంటూ గ‌మ్యంవైపు ప్ర‌యాణం ఎలా సాగించాలి? అందుకు ఎలాంటి ప్ర‌ణాళిక వేసుకోవాలి? వంటి వాటిపై దృష్టి పెట్టాల‌న్నారు.

కొన్ని ర‌కాల పాత్ర‌లే చేస్తాన‌ని కూర్చుంటే ప‌న‌వ్వ‌దు. వ‌చ్చిన అంద‌మైన అవ‌కాశాలు కూడా చేజారే అవ‌కాశం ఉంటుంది. అవ‌కాశాల గురించి ఎంత ఆలోచించినా జ‌ర‌గాల్సింది జ‌రుగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్ర‌యాణం దిశ‌ను మార్చాం అంటూ త‌మ‌లో వ‌చ్చిన మార్పును చెప్పారు. తొలి అవ‌కాశం అన్న‌ది అక్క‌డితే స‌రి. ఆ త‌ర్వాత ట్యాలెంట్ తోనే పైకి రావాలి అన్న వాస్త‌వాన్ని గ్ర‌హించారు.

Tags:    

Similar News