SSMB29 అప్డేట్ పై సితార ఆన్సర్ ఇదే
ఇదిలా ఉంటే తాజాగా సితార తాను బ్రాండ్ ఎండార్స్‌మెంట్ చేస్తున్న జ్యుయలరీ షాపు కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కు తల్లి నమ్రతతో కలిసి హాజరైంది.;

దర్శకధీరుడు రాజమౌళి ప్రాజెక్టులో మహేష్ బాబు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మహేష్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఏదైనా ఈవెంట్లు, పార్టీలు ఉంటే వాటికి నమ్రత, సితార హాజరవుతూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సితార తాను బ్రాండ్ ఎండార్స్‌మెంట్ చేస్తున్న జ్యుయలరీ షాపు కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కు తల్లి నమ్రతతో కలిసి హాజరైంది.
నమత్ర, సితార షోరూం ఓపెనింగ్ కు వస్తున్నారని తెలిసి ఎంతోమంది మహేష్ ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. షాప్ ఓపెనింగ్ అనంతరం నమ్రత, సితార మీడియాతో ముచ్చటించి, పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జ్యుయలరీ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్నే నమ్రతకు ఎదురైంది.
మహేష్ బాబు ఎప్పుడైనా ఏదైనా గోల్డ్ గిఫ్ట్ కానీ, మామూలు గిఫ్ట్ కానీ ఇచ్చారా అని ఓ రిపోర్టర్ నమ్రతను అడగ్గా దానికి నమ్రత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. మహేష్ బాబు కు అసలు గిఫ్టులు ఇచ్చే కాన్సెప్టే తెలియదని, ఎప్పుడూ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని, తాను- సితార మాత్రం ఒకరికొకరం గిఫ్టులు ఇచ్చుకుంటూ ఉంటామని నమ్రత తెలిపారు.
కొత్త షోరూంను ఓపెన్ చేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన సితార తన పేరుతో కొత్త కలెక్షన్స్ ను పరిచయం చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. ఈ సందర్భంగా నమ్రత, సితారను ఎస్ఎస్ఎంబీ29 గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని కోరగా, సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ అంటూ సితార ఆ ప్రశ్నకు సమాధానమివ్వకుండా తెలివిగా ఎస్కేప్ అయింది.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ చేయడం వల్ల సంపాదించే డబ్బు మొత్తాన్ని పలు సేవా కార్యక్రమాలకే వాడతాననని సితార గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పీఎంజే కోసం మరోసారి మహేష్ తో కలిసి యాడ్ చేయనున్నట్టు సితార ఈ సందర్భంగా తెలిపింది. సినిమాల్లోకి రాకముందే సితారకు ఈ రేంజ్ క్రేజ్ ఉంటే ఇక సినిమాల్లోకి వస్తే సూపర్ స్టార్ డాటర్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.