సితార.. సినిమా హిట్టే కానీ..!

క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తూ సితార నుంచి వస్తున్న సినిమాలు ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Update: 2025-01-24 20:30 GMT

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ బ్యానర్ గా కొనసాగుతుంది సితార ఎంటర్టైన్మెంట్స్. సూర్య నాగవంశీ ఆధ్వర్యంలో సితార బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నాయి. కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా సరే సితార బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే వర్తబుల్ అనేలా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మొన్నటిదాకా మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలు చేసిన నాగ వంశీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు కూడా చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తూ సితార నుంచి వస్తున్న సినిమాలు ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఐతే ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అనిపించుకుంటున్నా కూడా కేవలం కొన్ని ఏరియాలు మాత్రమే ప్రాఫిట్స్ వస్తున్నాయి. సితార బ్యానర్ నుంచి వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. కానీ సినిమాతో పాటు పోటీగా రిలీజైన క, అమరన్ కూడా హిట్ అవ్వడంతో కాస్త కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడింది. అందుకే లక్కీ భాస్కర్ సినిమాను థియేటర్ లో కన్నా ఓటీటీలో ఎక్కువమంది చూసి ఆహా ఓహో అనేశారు.

ఇక సంక్రాంతికి రిలీజైన డాకు మహారాజ్ కూడా బాలయ్య కెరీర్ లో మరో మాస్ హిట్ అనిపించుకుంది. కానీ కొన్ని ఏరియాల్లో ఆ సినిమా ఇంకా బ్రేకీవన్ కాలేదు. అంతేకాదు ఈసారి కూడా సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎఫెక్ట్ డాకు మహారాజ్ మీద పడింది. డాకు మహారాజ్ రిలీజైన మొదటి రెండు రోజులు ఊపు చూపించినా తర్వాత ఆ రేంజ్ వసూళ్లు రాబట్టలేదు.

సితార నుంచి ముఖ్యంగా నాగ వంశీ నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్ టైం లో సూపర్ అనిపించుకుంటున్నా అవి కమర్షియల్ లెక్కల్లో అన్ని చోట్ల లాభాలు రాబట్టలేకపోతున్నాయని టాక్ ఉంది. లాస్ట్ ఇయర్ గుంటూరు కారం విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయినట్టు టాక్. సో సితార బ్యానర్ నాగ వంశీ కాంబినేషన్స్, స్టోరీ సెలక్షన్స్ అన్ని బాగున్నాయి కానీ సినిమాతో అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ వచ్చేలా చేయడంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఇది బ్యానర్ ఎదుగుదలకు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఈ విషయంపై సితర నాగ వంశీ ఆలోచన ఎలా ఉందో చూడాలి. ఈ ఇయర్ సితార బ్యానర్ నుంచి అరడజను సినిమాల దాకా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News