ఆ ముగ్గురు సూపర్ స్టార్స్ సరసన 'అమరన్' స్టార్
ఇండస్ట్రీకి వారసత్వంతో అడుగు పెట్టిన స్టార్స్‌లో పలువురు ప్రస్తుతం స్టార్ హీరోల జాబితాలో ఉన్నారు.
టాలీవుడ్‌లో మాదిరిగా కోలీవుడ్‌లోనూ వారసులు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీకి వారసత్వంతో అడుగు పెట్టిన స్టార్స్‌లో పలువురు ప్రస్తుతం స్టార్ హీరోల జాబితాలో ఉన్నారు. అలాగే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి వచ్చిన వారు సైతం స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరోల జాబితాలో శివ కార్తికేయన్ చేరి పోయారు. కింది స్థాయి నుంచి వచ్చిన శివ కార్తికేయన్ తాజాగా అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన చిత్రాలతో, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ని 'అమరన్' సినిమా సూపర్ స్టార్ హీరోల సరసన నిలిపింది.
గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అమరన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు రూ.250 కోట్ల వసూళ్లు సాధించిన హీరోలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్. ఈ ముగ్గురు రూ.250 కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించారు. ఇతర హీరోలు వంద కోట్ల వసూళ్లకే అష్టకష్టాలు పడుతున్నారు. శివ కార్తికేయన్ ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ కారణంగా ఇప్పుడు రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరడంతో పాటు ఆ ముగ్గురు సూపర్ స్టార్‌ల సరసన స్థానం దక్కించుకున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో డాన్ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించిన శివ కార్తికేయన్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా అమరన్ సినిమాతో ఏకంగా రూ.250 కోట్ల వసూళ్లు సొంతం చేసుకోవడం జరిగింది. కోలీవుడ్ నుంచి విజయ్ తప్పుకుంటున్న నేపథ్యంలో ఆ స్థానంను శివ కార్తికేయన్ భర్తీ చేస్తాడని మొదటి నుంచి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా వర్గాల్లోనూ, ఆయన ఫ్యాన్స్‌లోనూ చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు అదే వాస్తవం కాబోతుందని, విజయ్ ఫ్యాన్స్ మొత్తం శివ కార్తికేయన్ వైపు తిరిగారు అంటూ తమిళ మీడియా వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
ఈ వారం స్టార్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కనబర్చే ప్రతిభను బట్టి అమరన్ వీకెండ్ కలెక్షన్స్ ఉంటాయి. రూ.300 కోట్ల వసూళ్లకు మరో రూ.50 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఆ స్థాయిలో ఇప్పుడు వసూళ్లు సాధించాలంటే మామూలు విషయం కాదు అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే కంగువా సినిమా ఫలితం తారుమారు అయితే మాత్రం కచ్చితంగా అమరన్ ఆ మైలు రాయిని సైతం చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.