తెర మీద హీరోల కొట్లాట.. టికెట్లు తెగకుండా ఉంటాయా..?
సినిమాలో ఒక హీరో ఉంటేనే ఆడియన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారు. అదే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే.. అది కూడా ఒకరితో మరొకరు కొట్లాడితే ఆ కిక్ వేరేలా ఉంటుంది
సినిమాలో ఒక హీరో ఉంటేనే ఆడియన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారు. అదే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే.. అది కూడా ఒకరితో మరొకరు కొట్లాడితే ఆ కిక్ వేరేలా ఉంటుంది. మనకు నచ్చిన ఇద్దరు స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. తెర మీద హీరోల కొట్లట్ కచ్చితంగా ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. ఆల్రెడీ సౌత్ సినిమాల్లో ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ తో మెగా నందమూరి మల్టీస్టారర్ కూడా సాధ్యమని ప్రూవ్ చేశాడు రాజమౌళి.
ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ లో అలాంటి ఒక మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ లో సొంత టాలెంట్ తో ఎదిగి హీరోగా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ దక్కించుకున్నాడు శివ కార్తికేయన్. లాస్ట్ ఇయర్ అతను చేసిన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది.
ఆ సినిమాతో పాటు శివ కార్తికేయన్ టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగరతో ఒక సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ మధ్యనే జరిగాయి. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే శివ కార్తికేయన్ తో పాటు మరో స్టార్ జయం రవి కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. శివ కార్తికేయన్, జయం రవి ఇద్దరు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఐతే జయం రవి ఈ సినిమాలో ప్రతినాయకుడి రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
జయం రవి విలనిజం కొత్తగా ఉంటుందని.. అందుకే ఆయన కథ వినగానే యెస్ నేను చేస్తున్నా అని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా వస్తుందని కథ కథనాలు అన్నీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయని అంటున్నారు. శివ కార్తికేయన్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అమరన్ తో కెరీర్ బెస్ట్ 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన శివ కార్తికేయన్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. శివ కార్తికేయన్ జయం రవితో పాటు శ్రీ లీల, అధర్వ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి పీరియాడికల్ డ్రామా అంటున్నారు కాబట్టి కచ్చితంగా సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది.