2018 స్పూర్తితో 1965?
మాలీవుడ్ లో టోవినో థామస్ హీరోగా నటించిన `2018` చిత్రం ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
మాలీవుడ్ లో టోవినో థామస్ హీరోగా నటించిన `2018` చిత్రం ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. 2018 నాటి వరద విపత్తు ఆధారంగా జ్యూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం పాన్ ఇండియాలో మంచి విజయం సాధిం చింది. 26 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగు నుంచే ఈ సినిమా భారీ వసూళ్లను రాబ్టటింది. అయితే ఇప్పుడీ సినిమా స్పూర్తితోనే కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ 25వ చిత్రం తెరకెక్కుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
`అమరన్` తో మంచి విజయం అందుకున్న శివకార్తికేయన్ ఇటీవలే 25వ చిత్రం ప్రకటించాడు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమా కథ ఎలాంటిదై ? ఉంటుందని నెట్టిట ప్రచారం జరుగుతంది. రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. జయంరవి, అధర్వ లాంటి హీరోలు సినిమాలో కీలక పాత్రలు పోషిం చడంతో మరింత బజ్ క్రియేట్ అవుతుంది. దీంతో సుధ కొంగర ఎంచుకున్న స్టోరీపై ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకి `1965` అనే టైటిల్ ను ఖరారు చేసారు. దీంతో సినిమా స్టోరీ ఏదై ఉంటుందని గెస్సింగ్స్ మొదలయ్యాయి. 1965లో కూడా కేరళ ఏదైనా విపత్తుకు గురైందా? ఆ సంఘటనే తెరపైకి తెస్తున్నారా? అనే సందేహాలు వ్యకతమవుతున్నాయి. 2018 సినిమా స్పూర్తి అంటే ఇలాంటి ఘటనే అయి ఉంటుందని మెజార్టీ వర్గం భావిస్తుంది. సినిమాలో మాత్రం నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనను ప్రేక్షకుల మనసులు హత్తుకునేలా చూపించబోతున్నారుట.
మునుపెన్నడు పోషించని పాత్రలో శివ కార్తీకేయన్ కనిస్తాడని సమాచారం. వాస్తవ సంఘటనలు వెండి తెరకు ఎక్కించడంలో సుధ కొంగర మాస్టర్ అని చెప్పాల్సిన పనిలేదు. `గురు`, `ఆకాశం నీ హద్దు రా` లాంటి చిత్రాలు వాస్తవ సంఘటనలు ఆధారంగానే తెరకెక్కించి దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. మరోసారి అలాటి వాస్తవ సంఘటననే తన కథా వస్తువుగా ఎంచుకుని 1965ని పట్టాలెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది.