మ్యాచో స్టార్ కోసం పాన్ ఇండియా డైరెక్టర్?
మ్యాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది ఏ దర్శకుడితో మూవీ చేసిన అతనికి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడటం లేదు.
మ్యాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది. ఏ దర్శకుడితో మూవీ చేసిన అతనికి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడటం లేదు. గోపీచంద్ కి చివరిగా లౌక్యంతో సూపర్ హిట్ వచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాలు పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి అయితే బ్లాక్ బస్టర్ సక్సెస్ లు మాత్రం రాలేదు. ఆయన నుంచి చివరిగా ‘రామబాణం’, ‘భీమా’, ‘విశ్వం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
ఇవన్నీ కూడా గోపీచంద్ మార్కెట్ కి మించిన బడ్జెట్ తో తెరకెక్కాయి. అయినా ఒక్కటి కూడా హిట్ కాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన ‘విశ్వం’ మరో డిజాస్టర్ బొమ్మగా మారింది. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఆ కలెక్షన్స్ ని కూడా లాంగ్ రన్ లో అందుకోలేకపోయింది. శ్రీనువైట్ల ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఈ సినిమాపై గట్టిగానే పడిందని అనుకుంటున్నారు.
గోపీచంద్ ఓ సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు గోపిచంద్ లిస్ట్ లోకి ‘కంగువా’ డైరెక్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. కంగువా సినిమాతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శివ. కోలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్న శివకి ‘కంగువా’ తో పాన్ ఇండియా సక్సెస్ రావడం గ్యారెంటీ అనుకుంటున్నారు. సినిమాటోగ్రాఫర్ గా ఉన్న శివకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చింది గోపీచంద్. శివ దర్శకత్వంలో గోపీచంద్ ‘శౌర్యం’ అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
తరువాత ‘శంఖం’ అనే మరో మూవీ చేశాడు. ఈ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. వీటి తర్వాత శివ రవితేజతో ‘దరువు’ అనే మూవీ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత కోలీవుడ్ లో వరుసగా అజిత్ తో సక్సెస్ లు అందుకున్నాడు. శివ చాలా కాలంగా గోపీచంద్ తో మూవీ చేయాలని అనుకుంటున్నాడు. ఇది ఆల్ రెడీ డిస్కషన్ లో ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా వర్క్ అవుట్ అవ్వాలని గోపీచంద్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గోపీచంద్ మరల ట్రాక్ లోకి రావాలంటే శివ లాంటి దర్శకుడు కావాలని అంటున్నారు. కంగువా తర్వాత శివ గోపీచంద్ తో మూవీ చేస్తే కచ్చితంగా దానికి పాన్ ఇండియా స్పాన్ వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. గోపీచంద్ కి సరైన హిట్ పడితే మరల అతని మార్కెట్, ఇమేజ్ అమాంతం పెరిగిపోతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.