నిన్న డైరెక్టర్..నేడు హీరో...ఏంటో ఈ వడ్డన!
ఎక్కువగా ఈ విధానం టాలీవుడ్...కోలీవుడ్ లో కనిపిస్తుంది.
సినిమాలు విజయం సాధిస్తే? కొందరికి ప్రతి ఫలం ఊహించని విధంగా ఉంటుంది. నిర్మాతకు మంచి లాభాలొస్తే? హీరోలకు అదనంగా పారితోషికం ఇవ్వడం... డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా ఇవ్వడం...ఇంకా బ్రాండెడ్ వస్తువులు ఏవి ఉంటే? అవి కొనివ్వడం అన్నది చాలా కాలంగా ఆనవాయితీగా కొనసాగుతుంది. ఎక్కువగా ఈ విధానం టాలీవుడ్...కోలీవుడ్ లో కనిపిస్తుంది. ఆ రకంగా సినిమా సక్సెస్ లో మరోసారి నిర్మాత వాళ్లను భాగం చేస్తాడు.
ఇది ఇండస్ట్రీలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం. మళ్లీ కలిసి పనిచేయడానికి ఇలాంటివి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అయితే కోలీవుడ్ లో ఈ మధ్య కొత్త ట్రెండ మొదలైనట్లు కనిపిస్తుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు మాత్రమే కాదు...కడుపు నిండా చిత్ర యూనిట్ కి అన్నం స్వహస్తాలతో వడ్డించడం కూడా. ఇటీవలే 'వెట్టేయాన్' బృందం థాంక్స్ గివింగ్ మీట్ ని చెన్నైలో ఏర్పాటు చేసింన సమావేశంలో దర్శకుడు జ్ఞాన్ వేల్ స్వయంగా చిత్ర బృందానికి తన స్వహాస్తాలతో వడ్డించాడు.
అలాగే మీడియా ప్రతినిధులకు కూడా తానే స్వయంగా వడ్డించి అక్కడ జర్నలిస్టుల పాలిట పక్షపాతి అనిపించాడు. అప్పట్లో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. తాజాగా ఇలాంటి సన్నివేశం మరోసారి చోటు చేసుకుంది. శివ కార్తికేయర్ హీరోగా నటించిన `అమరన్` ఇటీవల రిలీజ్ అయి ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగు ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు.
ఈ సందర్భంగా శివ కార్తికేయర్ కొత్త సినిమా సెట్స్ లో ఉండగా అక్కడే 'అమరన్' విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ కి శివ కార్తికేయన్ స్వయంగా వడ్డించాడు. అందరికీ బిర్యానీ వడ్డించాడు. ఆ తర్వాత అందులోకి కావాల్సినవన్నీ తానే దగ్గరుండి వేసాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో అయి ఉండి తానెంతో సింపుల్ పర్సన్ అని మరోసారి ప్రూవ్ చేసాడు. శివ కార్తికేయన్ వెరీ డౌన్ టూ ఎర్త్ అన్న సంగతి తెలిసిందే.