వీజే టు సిల్వర్ స్క్రీన్ రాజా..!
సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న శివ కార్తికేయన్ రీసెంట్ గా వచ్చిన అమరన్ తో 300 కోట్లు కలెక్ట్ చేసి నెవర్ బిఫోర్ రికార్డ్ అందుకున్నాడు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాల్లో హీరోగా రాణించగలగడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా బుల్లితెర మీద యాంకర్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ ఆ నెక్స్ట్ హీరోగా మారి క్రేజ్ తెచ్చుకోవడం చాలా కష్టం. అలాంటిది ముందు హీరోల ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చి ఆ తర్వాత సోలో హీరోగా సత్తా చాటి ఇప్పుడు స్టార్ గా అవతరించాడు తమిళ హీరో శివ కార్తికేయన్. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న శివ కార్తికేయన్ రీసెంట్ గా వచ్చిన అమరన్ తో 300 కోట్లు కలెక్ట్ చేసి నెవర్ బిఫోర్ రికార్డ్ అందుకున్నాడు.
శివ కార్తికేయన్ ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోయినా సరే తనలో ఏదో సంథింగ్ స్పెష క్వాలిటీ ఉందని గుర్తించి ఆ విధంగా ప్రయత్నాలు చేశాడు. ముందు స్మాల్ స్క్రీన్ మీదే తన టాలెంట్ చూపించి మెప్పించిన శివ కార్తికేయన్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై జస్ట్ అలా ఒక నిమిషం పాటు ఒక డైలాగ్ మాత్రమే చెప్పే పాత్రల్లో కనిపించాడు. ఐతే అలా వెనక ఉన్నా కూడా ఎప్పుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నిస్తూనే వచ్చాడు.
ఫైనల్ గా హీరోగా మారిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని చేయడం అన్నట్టు కాకుండా ఆచి తూచి అడుగులేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు. శివ కార్తికేయన్ సినిమా అయితే ఒకసారి చూసేయొచ్చు అన్న దగ్గర నుంచి శివ కార్తికేయన్ సినిమానా కంపల్సరీ చూడాల్సిందే అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్ లో కూడా అన్ని పరిశ్రమల్లానే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా తన ప్రతిభతో అక్కడ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు శివ కార్తికేయన్.
మనలో ఒకడు హీరో అయ్యి సక్సెస్ అయ్యాడంటే మనం అయినట్టే అనే భావన కలిగించాడు. అంతేకాదు ఎప్పుడు అతని లైఫ్ గురించి కదిలించినా కష్టపడితే దక్కనిది అంటూ ఏది ఉండదని మన ప్రయత్న లోపం వల్లే మనం చేరుకోవాల్సిన లక్ష్యాలు దూరం అవుతాయని చెబుతాడు. శివ కార్తికేయన్ చెప్పడమే కాదు చేసి చూపించాడు కాబట్టే అతన్ని స్పూర్తిగా తీసుకుంటున్నారు. శివ కార్తికేయన్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు సుధ కొంగర డైరెక్షన్ లో మరో సినిమా ఈమధ్యనే మొదలు పెట్టాడు.