ఆర్సీ ద కింగ్.. రియల్ గ్లోబల్ పాన్ ఇండియా ఫిల్మ్..!

చరణ్ గురించి చెబుతూ చిరంజీవి వారసుడిగా చరణ్ రియల్ కింగ్ అని.. తన స్టైల్ తో పాటు అన్ని విషయాల్లో ఆయన కింగ్ అని అన్నారు.

Update: 2024-12-29 08:04 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా డల్లాస్ లో జరిగింది. ఆ ఈవెంట్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్, ఎస్.జె సూర్య, అంజలి ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

ఇక ఈ ఈవెంట్ లో ఎస్.జె సూర్య ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని అలరించింది. మైక్ అందుకున్న సూర్య ముందు తన తెలుగు సినిమా ఎంట్రీ గురించి చెప్పారు. ఖుషి కథ చెప్పేందుకు పవన్ కళ్యాణ్ కి కలిశానని.. రెండున్నర గంటల న్యారేషన్ తర్వాత ఆయన సినిమా ఓకే చేశారని చెప్పారు. అంతేకాదు సినిమా అక్కడ తమిళ్ లో రిజల్ట్ ఏదైనా తాను ఈ సినిమా చేస్తానన్నారు. కానీ తమిళ్, తెలుగు రెండిటిలో సినిమా సూపర్ హిట్ అయ్యిందని సూర్య గుర్తు చేశారు.

ఇక ఆ తర్వాత స్పైడర్ తో యాక్టర్ గా తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇచ్చాను.. సరిపోదా శనివారంతో తనని ఆదరించారని అన్నారు ఎస్.జె సూర్య. ఇక గేమ్ ఛేంజర్ సినిమా గురించి చెబుతూ తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. డైరెక్టర్ శంకర్ గారు ప్రతి సీన్ ని చాలా జాగ్రత్తగా తీశారు. చరణ్ తో తన ఫేస్ ఆఫ్ సీన్స్ ఫ్యాన్స్ కి పండగలా ఉంటాయని అన్నారు.

చరణ్ గురించి చెబుతూ చిరంజీవి వారసుడిగా చరణ్ రియల్ కింగ్ అని.. తన స్టైల్ తో పాటు అన్ని విషయాల్లో ఆయన కింగ్ అని అన్నారు. అందుకే తన ఫోన్ లో ఆర్సీ ద కింగ్ అని పేరు ఉంటుందని అన్నారు. గేమ్ ఛేంజర్ రియల్ గ్లోబల్ పాన్ ఇండియా ఫిల్మ్ అని.. ఈ సినిమా సంక్రాంతికి అందరు ఎంజాయ్ చేసేలా ఉంటుందని అన్నారు. గేమ్ ఛేంజర్ రియల్ గేమ్ ఛేంజర్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్ అని అన్నారు ఎస్ జె సూర్య. మళ్లీ పవన్ తో కలిసి పనిచేస్తారా అని యాంకర్ సుమ అడిగితే ఆయన సినిమాలో విలన్ గా చేయాలని ఉందని అన్నారు ఎస్.జె సూర్య. మొత్తానికి గేం ఛేంజర్ ఈవెంట్ లో తన స్పీచ్ తో సూర్య మెగా ఫ్యాన్స్ ని నిజంగానే ఖుషి చేశారు.

Tags:    

Similar News