మహేష్ కు హిట్ బాకీ ఉన్నా..!
అయితే తెలుగులో మళ్లీ డైరెక్షన్ చేస్తే మహేష్ తో సినిమా చేస్తానని ఆయనకు హిట్ ఇవ్వాలని ఉందని అన్నారు సూర్య.
సూపర్ స్టార్ మహేష్ కు హిట్టు బాకీ ఉన్నానని అన్నారు తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె సూర్య. విశాల్ హీరోగా ఆధిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన మార్క్ ఆంటోని సినిమాలో ఎస్.జె సూర్య నటించారు. సినిమాలో విశాల్ కు ఈక్వల్ గా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఎస్.జె సూర్య స్పీచ్ తెలుగు ఆడియన్స్ ను అలరించింది. తమిళంలో అజిత్, విజయ్ లాంటి స్టార్స్ కు హిట్ ఇచ్చానని ఇక్కడ పవన్ తో ఖుషి చేశానని మహేష్ తో నాని చేశా కానీ అది ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
మహేష్ కు హిట్ బాకీ ఉన్నానని అన్నారు ఎస్.జె సూర్య. 2004 లో మహేష్ హీరోగా ఎస్.జె సూర్య డైరెక్షన్ లో నాని సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రయోగాత్మకంగా వచ్చినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.
మహేష్ సోదరి మంజుల ఆ మూవీ నిర్మించారు. ఆ సినిమా తర్వాత మహేష్ నటించిన స్పైడర్ సినిమాలో ఎస్.జె సూర్య విలన్ గా నటించారు. అయితే తెలుగులో మళ్లీ డైరెక్షన్ చేస్తే మహేష్ తో సినిమా చేస్తానని ఆయనకు హిట్ ఇవ్వాలని ఉందని అన్నారు సూర్య.
తాను నటుడిని అయ్యేందుకే డైరెక్ట్ గా అది కష్టమని డైరెక్టర్ గా మారానని ఆ తర్వాత నటుడిగా సినిమాలు చేస్తూ వచ్చానని అన్నారు. కోలీవుడ్ లో ఈమధ్య వరుస సినిమాల్లో ఎస్.జె సూర్య కనిపిస్తున్నారు. డైరెక్టర్ గా తన అనుభవాన్ని కూడా వాడుకుంటూ యాక్టర్ గా తన ప్రతిభ చాటుతున్నారు సూర్య. తెలుగులో స్పైడర్ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు.
తమిళంలో మాత్రం సపోర్టింగ్ రోల్, విలన్ రోల్ ఇలా ఏ పాత్ర అయినా చేసేందుకు రెడీ అంటున్నారు. తెలుగులో నటుడిగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని కెరీర్ లో ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని అన్నారు ఎస్.జె సూర్య. అయితే మహేష్ కి హిట్ ఇస్తానని ఎస్.జె సూర్య కామెంట్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.
మహేష్ తో సినిమా చేయాలని సూర్యకి ఉన్నా అది ఇప్పుడప్పుడే కుదిరే పని కాదని చెప్పొచ్చు. ఆల్రెడీ గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా ఫిక్స్ చేసుకున్న మహేష్ ఆ సినిమా కోసం ఎలా లేదన్నా రెండు మూడేళ్లు రాసిచ్చేయాల్సిందే. సో వేరే డైరెక్టర్ తో మహేష్ సినిమా అంటే అది 3 ఏళ్ల తర్వాత మాటే అని ఫిక్స్ అవ్వొచ్చు.