స్కంద సెటైర్లు బాగానే విసిరారు..!
రామ్ స్కంద సినిమాలో ఛాన్స్ దొరికితే చాలు పంచులు పేల్చాడు బోయపాటి. ఏకంగా ఆంధ్రా, తెలంగాణా సీఎం ల నేపథ్యంతో కథను చెప్పిన బోయపాటి సందట్లో సడేమియా అన్నట్టు కొన్ని డైలాగ్స్ విసిరాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటించిన స్కంద సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ కు మాత్రమే అని చెప్పుకుంటున్నారు. ఎప్పటిలానే కథ కథనాల మీద కన్నా బోయపాటి నరుకుడు మీదే దృష్టి పెట్టాడు. రామ్ లాంటి హీరోతో ఇలాంటి ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ కచ్చితంగా డేర్ స్టెప్ అని చెప్పొచ్చు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. రామ్ ఎనర్జీని బోయపాటి ఇంకా వాడుకుంటే బాగుండేదని అంటున్నారు.
సినిమా ఎలా ఉన్నా బోయపాటి కొన్ని అంశాలు కచ్చితంగా ఫాలో అవుతాడు. వాటిలో ఆయన పంచు డైలాగులు కూడా ఒకటి. రామ్ స్కంద సినిమాలో ఛాన్స్ దొరికితే చాలు పంచులు పేల్చాడు బోయపాటి. ఏకంగా ఆంధ్రా, తెలంగాణా సీఎం ల నేపథ్యంతో కథను చెప్పిన బోయపాటి సందట్లో సడేమియా అన్నట్టు కొన్ని డైలాగ్స్ విసిరాడు. స్కంద ఫస్ట్ హాఫ్ లో రచ్చ రవి పాత్ర ఉచితాలతో జనాన్ని మోసం ఎలా చేయొచ్చో ఎంత బ్లైండ్ గా ఓట్లు వేస్తారో డైలాగ్ గా చెప్పించిన తీరు ఎవరిని టార్గెట్ తో రాశాడో అర్థం చేసుకోవచ్చు.
రామ్ బాబాయ్ తో తనకు బూం బూం బ్రాండ్ మందు కావాలని డిమాండ్ చేస్తాడు. అక్కడ అవసరం లేకపోయినా కూడా అది పొందుపరిచారని అనిపిస్తుంది. ఇక లాయర్ డైలాగ్స్ కూడా ఎవరినో ఉద్దేశించి రాసినట్టు ఉంటుంది. వీటితో పాటుగా తెలుగు రాష్ట్రాల సీఎంలను రౌడీలుగా చూపించడం చేశాడు బోయపాటి. భూ దందాలు, బ్లాక్ మనీ వైట్ చేసే ప్లాన్ ఇలా సినిమా అంతా కూడా బోయపాటి తను చెప్పాలనుకున్న కథ కన్నా ఎవరినో టార్గెట్ చేసి పెట్టాడన్నట్టు ఉన్నాయి.
సినిమా టాక్ ప్రస్తుతానికి యావరేజ్ గా ఉన్నా మండే వరకు అసలు సినిమా లెక్క ఏంటన్నద్ తేలుతుంది. రామ్ స్కంద సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే అఖండ రేంజ్ మ్యూజిక్ అందించడంలో ఫెయిల్ అయ్యాడు థమన్. శ్రీ లీలని కూడా సరిగా వాడుకోలేకపోయారు. రామ్ స్కంద ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది చూడాలి. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన స్కంద సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజైంది. సినిమా తెలుగులోనే ఇలాంటి టాక్ తెచ్చుకోగా మిగతా భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో తెలియాల్సి ఉంది.