బేబీ వైష్ణవి.. SKN అప్సెట్?
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే అభిమానుల సందడి, నటీనటుల ఉత్సాహం, చిత్రబృందం ఉల్లాసంగా మాట్లాడే వేడుకలా ఉంటుంది.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే అభిమానుల సందడి, నటీనటుల ఉత్సాహం, చిత్రబృందం ఉల్లాసంగా మాట్లాడే వేడుకలా ఉంటుంది. కానీ, ఇటీవల జరుగుతున్న ఈవెంట్స్ లలో ఎవరో ఒకరు మాట్లాడిన విధానం కాంట్రవర్సీగా మారుతోంది. రీసెంట్ గా పృథ్వి లైలా ఈవెంట్ లో చేసిన కామేంట్స్ ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా జరిగిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఒక కొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
దీనికి కారణం.. నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయడంపై ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం.. తెలుగు భాష తెలిసిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే తనకు ఏం జరిగిందో తెలిసిందని, అందుకే భాష తెలియని హీరోయిన్లను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ మాటలు విన్న ప్రేక్షకులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ముఖ్యంగా, బేబీ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో, ఆ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య గురించే ఆయన ఇలా మాట్లాడినట్లు అనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మాత కేవలం హీరోయిన్ల అంశానికే పరిమితం కాకుండా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హీరోయిన్ కాయదు లోహర్ పేరుపై కూడా వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషలో “కాయ” అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయని చెప్పడం, అందులో ఓ స్పెషల్ మీనింగ్ ఉందన్నట్లు నటించడం వివాదాస్పదమైంది.
అయితే, ఇది సరదాగా అన్నట్టుగానే చెప్పినట్లు ఆయన తన వ్యాఖ్యలను కవర్ చేసుకున్నా, కొందరు ప్రేక్షకులు మాత్రం దీనిని సరైన వ్యాఖ్యలు కావని అంటున్నారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న స్థానిక హీరోయిన్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఒక ప్రముఖ నిర్మాత ఇలా మాట్లాడడం తగదని ఓ వర్గం నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు తీస్తూ, ఇక్కడి అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వనని ప్రకటించడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంకా ఒక కోణంలో చూస్తే, వైష్ణవి చైతన్య గురించి ఉద్దేశించుకుని ఈ వ్యాఖ్యలు చేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది. బేబీ సినిమా తర్వాత వైష్ణవి తన తదుపరి ప్రాజెక్ట్స్‌ను ఎస్‌కేఎన్ ప్రొడక్షన్‌లో కాకుండా, ఇతర ప్రొడక్షన్ హౌస్‌ల్లో చేసుకుంటోందన్న వార్తల నేపథ్యంలో.. ఆమె పై అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, ఓ ప్రముఖ నిర్మాతకు ఇలాంటి వివాదాస్పద కామెంట్లు అవసరమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.న్ఇప్పటికే వివాదం పెద్దదవుతుండటంతో, ఎస్‌కేఎన్ దీనిపై స్పందించి వివరణ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.