క్షమార్హులు కాదు.. పోసాని కామెంట్స్ కు SKN కౌంటర్
ఆయన కామెంట్స్ పై నిర్మాత SKN రియాక్ట్ అయ్యారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
రచయిత, దర్శకుడు, నటుడు అయిన పోసాని కృష్ణమురళీ ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు రాజకీయంగా కాస్తా యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీకి మద్దతుగా అయన ప్రెస్ మీట్ లు పెట్టి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ కి అండగా ఉంటూ వచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలపైన పోసాని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అదే సందర్భంలో పోసాని కూడా సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలకి టార్గెట్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా పోసాని కృష్ణమురళీ ప్రెస్ మీట్ పెట్టి తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఇకపై ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడను. ఏ పార్టీపైన విమర్శలు చేయను. ఒక పౌరుడిగా కూడా రాజకీయాలు మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇంతకాలం సినిమాలు, రాజకీయాల ద్యాసలో పడి కుటుంబాన్ని పట్టించుకోలేదు. నా కొడుకు అన్న కొన్ని మాటలకి నేను సమాధానం చెప్పలేకపోయాను.
అందుకే పూర్తిగా రాజకీయాలు ఇకపై మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను అని పోసాని కృష్ణమురళీ చెప్పారు. ఇదిలా ఉంటే పోసాని రాజకీయాల నుంచి తప్పుకోవడంపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన కామెంట్స్ పై నిర్మాత SKN రియాక్ట్ అయ్యారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
'సార్, ఇప్పుడు అందరికి అన్ని గుర్తొస్తాయి. కానీ విరమిస్తున్న అని నటించే ముందు కనీసం మీరు మా అభిమాన నాయకుడి గురించి, ముఖ్యంగా ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని లేకి వాఖ్యలకి చింతిస్తున్న లేదా క్షమించండి అని అడిగి ఉంటె కనీసం ఈ మాటలు నమ్మాలనిపించేది. మీరు ఎదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు. ఎన్నో సార్లు ఎంతో నీచంగా మాట్లాడారు.
అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఛీ ఇవేం మాటలు అని చెవులు మూసుకొనేలా చేశారు. మీ ఒకళ్ళదే కాదు సార్ అందరివీ కుటుంబాలే. ఎవరి పిల్లలు ఐన పిల్లలే. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు అని ఎస్ కె ఎన్ ట్వీట్ చేశారు. ఈయన ట్వీట్ పై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. మరి పోసాని ఈ కామెంట్స్ కు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.