వీడియో : బన్నీ బర్త్‌డేకి స్నేహా ఏం చేసిందో చూడండి

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.;

Update: 2025-04-08 13:28 GMT
వీడియో : బన్నీ బర్త్‌డేకి స్నేహా ఏం చేసిందో చూడండి

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప 2 సినిమాతో నార్త్‌ ఇండియాలో ఏకంగా రూ.1000 కోట్లకు మించి వసూళ్లు సాధించిన అల్లు అర్జున్‌ అక్కడ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డ్‌ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న పుష్ప 2 సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్‌ చేసుకుంటున్న మొదటి బర్త్‌ డే కావడంతో ఈ బర్త్‌డే చాలా స్పెషల్‌గా నిలిచింది అనడంలో సందేహం లేదు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్పరాజ్‌ ఈ బర్త్‌డే ను ఎప్పటిలాగే తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నాడు.

అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున ఫోటోలు వీడియోలు షేర్‌ చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో బన్నీతో తమకు ఉన్న అనుబంధం, ఆయన సినిమాల గురించి షేర్ చేస్తూ వస్తున్నారు. ఎంత మంది ఏం షేర్‌ చేసినా, స్నేహా రెడ్డి షేర్‌ చేసే పోస్ట్‌ చాలా స్పెషల్‌ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహా రెడ్డి ఈ సందర్భంలో ఎలాంటి పోస్ట్‌ షేర్‌ చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అల్లు అర్జున్‌తో పాటు తన ఫ్యామిలీ మొత్తం ఉన్న ఫోటోలు, బ్యూటీ ఫుల్‌ మూమెంట్స్‌ను వీడియో రూంలో షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో బన్నీ స్టైలిష్ ఐకాన్‌గా కనిపించాడు. వివిధ లుక్‌తో పాటు, వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకట్టుకునే విధంగా ఉన్న వీడియోలో అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డిల బంధం ఎంత బ్యూటీఫుల్‌గా ఉంటుందో చెప్పకనే చెప్పవచ్చు. అంతే కాకుండా వీరి పిల్లలు అల్లు అయాన్‌, అర్హ ఎంత ముద్దుగా ఉన్నారో కూడా ఈ వీడియోలో చూడవచ్చు. వీరిద్దరికి తగ్గట్లుగా పిల్లలు కూడా చాలా క్యూట్‌గా ఉన్నారు. మొత్తంగా వీరిది ఒక బ్యూటీఫుల్‌ ఫ్యామిలీ అనడంలో సందేహం లేదు.

అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆలస్యం చేయకుండా అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. నేడు అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా ఒక వీడియోను సైతం విడుదల చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది.

Tags:    

Similar News