శోభిత పెళ్లికూతురు వేషధారణలో డ్యాన్సులు
శోభిత ధూళిపాల- నాగచైతన్య జంట వివాహం.. వివాహానంతర విందు కార్యక్రమాల గురించి తెలిసిందే.
శోభిత ధూళిపాల- నాగచైతన్య జంట వివాహం.. వివాహానంతర విందు కార్యక్రమాల గురించి తెలిసిందే. డిసెంబర్ 4న హైదరాబాద్ అన్న పూర్ణ స్టూడియోస్‌లో ఈ అందమైన జంట వివాహ వేడుక జరిగింది. ఈ వేడుక నుంచి చాలా ఫోటోలు, వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు శోభితకు సంబంధించిన ఓ హార్ట్ టచింగ్ వీడియో ఒకటి విడుదలైంది. పెళ్లి సంబరాల వేళ శోభిత తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది. తాజాగా విడుదలైన వీడియో క్లిప్ లో తమ బారాత్ సంగీత్ బీట్‌లకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది శోభిత. తన స్టెప్పులు ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ఆ సమయంలో శోభిత ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.
ఈ వీడియోను శోభిత మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా షేర్ చేశారు. పెళ్లి చూపుల వేళ శోభిత తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయింది. డోల్ భాజా దరువులకు ఆనందంగా డ్యాన్సులు చేసింది. నాకు పెళ్లవుతోంది.. నాకు సిగ్గేస్తోంది! అంటూ డ్యాన్సులు చేస్తూ ఆనందంతో మెరిసింది. పెళ్లి కూతురు గెటప్ లో శోభిత డ్యాన్సుల వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ప్రేమతో మెరుపు.. మ్యాజికల్ స్పర్శ @శోభిత అని ఈ పోస్ట్‌కు శీర్షిక పెట్టారు. `బారాత్ ఫోమో నిజమైనది` అంటూ అభిమానులు ఈ వీడియోను వైరల్ గా షేర్ చేస్తున్నారు. శోభిత తన భర్త చైతన్య మంచితనం, మర్యాదగా ఉండే స్వభావం గురించి చాలా ఎక్కువగా మాట్లాడింది. అతడి లాంటి భర్త తనకు దక్కడం అదృష్టమని మురిసిపోయింది. అక్కినేని నాగార్జున తమ ఇంట కోడలు అడుగుపెడుతున్న వేళ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు.