పిక్ టాక్ : పెళ్లి కూతురుగా శోభిత
శోభిత ధూళిపాళ ముక్కుకు ముక్కెర ధరించడంతో పాటు, మెడలో అత్యంత ఖరీదైన బంగారు ఆభరణాలు, సాంప్రదాయ బద్దమైన వస్త్రాల కారణంగా శోభిత చూపు తిప్పుకోనివ్వడం లేదు.
అక్కినేని ఫ్యామిలీలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య, శోభిత పెళ్లి ఫోటోలను స్వయంగా కుటుంబ సభ్యులు, పీఆర్ టీం రిలీజ్ చేయడం జరిగింది. గత వారం రోజులుగా అదే చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఆహా, ఓహో అంటూ అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ శోభిత, నాగ చైతన్య ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. కొత్త జంటకు ఫోటోలను చూస్తూ శుభాకాంక్షలు చెబుతున్న వారు చాలా మంది ఉన్నారు. నాగ చైతన్య వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగాలంటూ అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక శోభిత సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఆమె పెళ్లి కూతురుగా కనిపిస్తున్న పోటోలు కన్నులకి ఇంపుగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. చాలా పద్దతి అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన శోభిత పెళ్లి డ్రెస్సింగ్‌లోనే తన మార్క్‌ను చూపించారు. మోడల్‌గా సుదీర్ఘ కాలం కొనసాగడంతో పాటు, బాలీవుడ్ సినిమాల్లోనూ నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న శోభిత ఎందుకు చాలా సింపుల్‌గా చీరలు ఎంపిక చేసుకున్నారు అంటూ చాలా మంది అవాక్కయ్యారు. అయితే సింపుల్ చీర కట్టులోనే మరింత అందంగా కనిపించవచ్చు అని ఆమె నిరూపించారు.
శోభిత ధూళిపాళ ముక్కుకు ముక్కెర ధరించడంతో పాటు, మెడలో అత్యంత ఖరీదైన బంగారు ఆభరణాలు, సాంప్రదాయ బద్దమైన వస్త్రాల కారణంగా శోభిత చూపు తిప్పుకోనివ్వడం లేదు. నాగ చైతన్య పెళ్లి చేసుకోవడంతో అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిన శోభిత ఆ కుటుంబం యొక్క గౌరవంను పెంచే విధంగా కనిపిస్తున్నారు అంటూ కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే నాగ చైతన్య భార్య శోభిత అంటూ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉన్నారు.
మోడల్‌గా హిందీ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్‌లోనూ పొన్నియిన్ సెల్వన్‌లోని ముఖ్య పాత్రతో మెప్పించింది. ఇప్పుడు తమిళ్‌లో ఒక ప్రముఖ హీరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగులో గూఢచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. ఫ్యూచర్‌లో నాగ చైతన్య హీరోగా శోభిత హీరోయిన్‌గా ఏమైనా సినిమాలు వస్తాయేమో చూడాలి.