వెడ్డింగ్ కార్డులో చైతన్య భార్య పేరు ఇలా!
ఇది పెళ్లి కుమారుడు తాలుకా పత్రిక కావడంతో తొలుత నాగచైతన్య పేరు...ఆ కిందనే వధువు శోభిత దూళిపాళ ఉంది.
నాగ చైతన్య-శోభిత వివాహ బంధంలోకి అడుగు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముహూర్తం పెట్టేసారు. డిసెంబర్ 4న ఈ వివాహం అన్న పూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఈవేడుకకు కేవలం అతికొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఇండస్ట్రీ నుంచి కొన్ని ఫ్యామిలీలు, నాగార్జున, చైతన్య స్నేహితులు, సన్ని హితులు, అలాగే పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పక హాజరయ్యే అవకాశం ఉంది.
తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి ఆహ్వాన పత్రిక వైరల్ అవుతుంది. అంటే వెడ్డింగ్ కార్డు పంపినీ కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది పెళ్లి కుమారుడు తాలుకా పత్రిక కావడంతో తొలుత నాగచైతన్య పేరు...ఆ కిందనే వధువు శోభిత దూళిపాళ ఉంది. అయితే ఇందులో శోభిత పేరు ముందు లక్ష్మీ శోభితగా రాసి ఉంది. అయితే ఇలా వేయడం వేనుక ఏదైనా అనవాయితీనా? లేక లక్ష్మీ శోభిత అన్నది పూర్తి పేరు ప్రకారం వేసారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
అలాగే శోభిత పేరు కింద ఆమె తల్లిదండ్రుల పేర్లు కూడా అచ్చు వేసారు. ఈ వివాహ వేడుకలో శోభిత చాలా నిరాడంబరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. నాగ చైతన్య తాతగారి లెగసీ గౌరవిస్తూ శోభిత సాంప్రదాయ బద్దంగా నేచురల్ మేకప్ తో కనిపించనున్నారుట. ఇందులో నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి కోరిక కూడా ఉందట.
నాగ చైతన్య తల్లి కోరిక మేరకు కూడా శోభిత పెళ్ళిలో ఫారెన్ బ్రాండ్లు కాకుండా, కాంచీవరం చీరలు, జ్యువెలరీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కోడలికి నాగచైతన్య తల్లి లక్ష్మి సొంత డబ్బుతో కొన్ని బంగారు ఆభరణాలు కూడా చేయించారుట. వాటిని ఆవిడే శోభిత మెడలో వేస్తారని సమాచారం.