మ‌త్తెక్కించే కాల్ గ‌ర్ల్ ఈ తెలుగ‌మ్మాయి!

స‌మ‌కాలీనంగా ఇంత బెస్ట్ క్రేజ్ ఉన్న వేరొక తెలుగు క‌థానాయిక‌ లేరు అంటే అతిశ‌యోక్తి కాదు.

Update: 2024-04-08 01:30 GMT

వ‌రుస ప్ర‌యోగాల‌తో అట్టుడికిస్తోంది తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాల‌. కెరీర్ ఆరంభం నుంచి త‌న‌దైన అద్భుత న‌ట‌న‌, గ‌ట్సీ బోల్డ్‌ లుక్స్‌తో మతులు చెడ‌గొడుతున్న శోభిత‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీర‌లెవ‌ల్లో ఫాలోయింగ్ ఏర్ప‌డింది. స‌మ‌కాలీనంగా ఇంత బెస్ట్ క్రేజ్ ఉన్న వేరొక తెలుగు క‌థానాయిక‌ లేరు అంటే అతిశ‌యోక్తి కాదు.


ఇంత‌కుముందు అడివి శేష్ మేజ‌ర్ చిత్రంలో అద్భుత పాత్ర‌లో న‌టించి శోభిత ఆక‌ట్టుకుంది. ఇటీవ‌ల నైట్ మేనేజ‌ర్, మేడ్ ఇన్ హెవ‌న్‌లో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించి మెప్పించింది. ఇంకా చాలా సినిమాల్లో శోభిత పాత్ర‌ల‌కు గొప్ప గుర్తింపు ద‌క్కింది. ఇప్పుడు వీట‌న్నిటినీ మించేలా కాల్ గ‌ర్ల్ పాత్ర‌తో మైమ‌రిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

వరుస‌గా విజయవంతమైన చిత్రాలు వెబ్ సిరీస్‌లలో న‌టించిన‌ శోభితా ధూళిపాళ దేవ్ పటేల్ న‌టించిన `మంకీ మ్యాన్‌`తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. పొన్నియిన్ సెల్వన్ I , పీఎస్ II (2022), మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 1, సీజ‌న్ 2 ల‌లో శోభిత ప‌ని చేశాక హాలీవుడ్ అవ‌కాశాన్ని శోభిత విడిచిపెట్ట‌లేదు. ఇది శోభిత‌కు ఒక స్పష్టమైన ముందడుగు అన‌డంలో సందేహం లేదు. శోభిత‌ మొదటి హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్ ఇటీవల అంతర్జాతీయంగా విడుదలైంది. ది న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ముచ్చ‌టించింది. అలాగే యాక్షన్ థ్రిల్లర్‌లో సహ-రచయిత, నిర్మించి, దర్శకత్వం వహించిన స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ న‌టుడు దేవ్ పటేల్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉందో చెప్పింది.

మంకీ మ్యాన్‌లో సీత అనే కాల్ గర్ల్‌గా శోభిత‌ నటించింది. కాల్ గ‌ర్ల్ వ్యాపారం సంపాద‌న కోస‌మే కానీ జుగుప్సాకరమైన పురుషుల ఆనందాన్ని భ‌రించే వృత్తి. ఇది సంక్లిష్ట‌మైన పాత్ర అయినా కానీ, దానివ‌ల్ల గుర్తింపు ద‌క్కుతుందంటే నేను న‌మ్మ‌కంగా ముందుకు వెళ‌తాన‌ని శోభిత అన్నారు.

శోభిత భారతదేశంలో తన మొదటి చిత్రం (అనురాగ్ కశ్యప్ 2016 చిత్రం రామన్ రాఘవ్ 2.0) విడుదలకు ముందే మంకీ మ్యాన్‌లో సీత పాత్ర కోసం ఆడిషన్ లో పాల్గొన్నాన‌ని తెలిపింది. త‌న వద్దకు తిరిగి రావడానికి టీమ్‌కి చాలా సంవత్సరాలు పట్టిందని, 2019లో దేవ్ తన ఆడిషన్‌ను చూసినప్పటి నుండి తాను మాత్ర‌మే స‌రిపోతాన‌ని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

తన మొదటి హాలీవుడ్ చిత్రంగా దేవ్‌ డైరెక్ష‌న్ డెబ్యూ మూవీని ఎంచుకోవ‌డం ప్రమాదకర చర్య కాదా? అని అడిగినప్పుడు, శోభిత త‌మ‌మ‌ధ్య న‌మ్మ‌కం గురించి మాట్లాడింది. ఇది పూర్తిగా భిన్నమైన సంబంధం. నమ్మకం, భయం, దుర్బలత్వం ఉన్నాయి. మొద‌టిసారి క‌లిసి ప‌ని చేసినా న‌మ్మ‌కంతో ముందుకు సాగామ‌ని శోభిత వెల్ల‌డించింది.

మంకీ మ్యాన్ గురించి

యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ క‌థ ఆస‌క్తిక‌రం. తన తల్లిని హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. హనుమంతుని పురాణం నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రాన్ని జోర్డాన్ పీలే నిర్మించారు. దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు. మంకీ మ్యాన్ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇది భారతదేశంలో ఇంకా విడుదల కాలేదు. మంకీ మ్యాన్ ముందుగా దేశంలో ఏప్రిల్ 19న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

Tags:    

Similar News