మధ్యాహ్న సూర్యుడికి శోభిత సవాల్
తాజాగా శోభిత షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ యువతరం గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఈ ఫోటోషూట్ కి ప్రత్యేకించి థీమ్ ఉంది.
కర్లీ హెయిర్ తో గుండె గిల్లుతుంది శోభిత. ఈ అందమైన తెలుగమ్మాయి కీర్తి విశ్వవిఖ్యాతం అయింది. సైలెంటుగా ప్రతిభతో దూసుకుపోతోంది తెనాలమ్మాయ్. గూఢచారి, మేజర్, ది నైట్ మేనేజర్, మేడ్ ఇన్ హెవెన్.. ఇలా వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో విషయం ఉన్న పాత్రలతో మెప్పించిన శోభిత తదుపరి హాలీవుడ్ సినిమా 'మంకీ మ్యాన్'లో కనిపించనుంది. ఈ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ కథానాయకుడిగా నటించాడు. మూవీ త్వరలో విడుదలకు రానుంది.
ఈ సందర్భంగా తన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శోభిత మరోవైపు వరుస ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. తాజాగా శోభిత షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ యువతరం గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఈ ఫోటోషూట్ కి ప్రత్యేకించి థీమ్ ఉంది. ఎంచుకున్న థీమ్ కి తగ్గట్టే శోభిత డార్క్ మోడ్ లో రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది.
మధ్యాహ్న సూర్యుడు కర్లీ హెయిర్ స్పైసీ లంచ్... అంటూ ట్యాగ్ ని జోడించి ఈ అందమైన ఫోటోషూట్ ని శోభిత షేర్ చేసింది. ఎంపిక చేసుకున్న థీమ్ ని బట్టి మధ్యాహ్నం వేళ సూర్యుని కాంతి చీకటి ప్రదేశంలో పడినప్పుడు అక్కడ చిత్రీకరించిన ఫోటోషూట్ ఇదని భావించాలి. డార్క్ థీమ్ ఒక వైపు సూర్యుని కాంతి మరోవైపు హైలైట్ గా కనిపిస్తున్నాయి ఈ ఫోటోషూట్ లో.
అంతకుమించి శోభిత అందచందాలు మతులు చెడగొడుతున్నాయి. పింక్ టైట్ టాప్ ధరించిన శోభిత, ప్రయోగాత్మక బాటమ్ లైన్ తో మెరిపిస్తోంది. తన కర్లీ హెయిర్ స్టైల్ అంతే కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. మధ్యాహ్న సూర్యుడికి శోభిత సవాల్ విసిరింది.. చాలా బావుంది.. అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.
తాజా చిత్రం 'మంకీ మ్యాన్' గురించి శోభిత ఇలా చెప్పింది. ''మంకీ మ్యాన్‌లో సీత అనే కాల్ గర్ల్‌గా నటించాను. వేశ్యలు అందంగా కనిపించే సంక్లిష్టమైన మనుషులు. అలాంటి పాత్రలో నటించగలనని నమ్మి దేవ్ అవకాశం కల్పించడం నిజంగా ఒక గౌరవం... ఏదైనా నాకు స్ఫూర్తినిస్తే లేదా కథకు నేను డ్రైవ్ చేయగలిగిన .. కొంత విలువ ఉంటే, నేను ఆ పాత్రతో కలిసి ఉండాలనుకుంటాను..'' అని శోభిత నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.