2024 గురించి సోనాక్షి ఏమందంటే?
అలాగే కళాత్మక చిత్రాల దర్శకుడు టేకప్ చేసిన 'హీరామండి'లోనూ భాగమైంది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకి 2024 ఎంతో ప్రత్యేకమైన ఏడాదిగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రేమించిన వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకుని ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టింది. కెరీర్ పరంగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నటిగా కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి బిజీగానే ఉంది. ఏ నాడు సినిమాలు లేక ఖాళీగా ఉంది లేదు. ఈ ప్రోసస్ లో రైటర్ జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో పడింది.
ఆ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లింది. అలాగే కళాత్మక చిత్రాల దర్శకుడు టేకప్ చేసిన 'హీరామండి'లోనూ భాగమైంది. ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024కి గుడ్ బై చెప్పడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సోనాక్షి 2024-25 ని ఉద్దేశించి మాట్లాడింది. `ఈ ఏడాది నేను ఊహించని రెండు సర్ ప్రైజ్ లు ఎదురయ్యాయి. వివాహంతో నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని ప్రారంభించాను.
భన్సాలీ సినిమాలో నటించే అరుదైన అవకాశం వచ్చింది. అది మంచి విజయం సాధించింది. మరోవైపు 'కాకుడా' చిత్రంతో ఎలాంటి పాత్రలోనైనా నేను నటించగలను అని నిరూపించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యక్తిగతం గా..వృత్తిగతంగా ఎంతో ముఖ్యమైనది. ఈ సంతోషంలోనే 2025లోకి అడుగు పెడుతున్నాను. వచ్చే ఏడాది కొత్త కథల్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నా` అంది.
భర్త జహీర్ మంచి రచయిత. ఈసారి భార్యామణి కోసం తానే మంచి కథలు సిద్దం చేస్తాడు. భార్యకు నచ్చేలా ఆ పాత్రను తీర్చి దిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో స్టోరీ బ్యాంక్ ఉంటే? నిర్మాతల్ని సెట్ చేసుకోవడం సోనాక్షికి చిటిక వేసినంత పని. అందుకేనేమో ధీమాగా 2025 లో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకొస్తానని ధీమా వ్యక్తం చేసింది.