స్టార్ హీరోయిన్ ప్రేమ పెళ్లి.. ఫ్యామిలీకి ఇష్టం లేదా?
ఇటీవల సోనాక్షి సిన్హా మావయ్య పహ్లాజ్ నిహ్లానీ మాట్లాడుతూ.. సోనాక్షి సిన్హా తన వివాహ ప్రణాళికల గురించి తండ్రి శత్రుఘ్నకు తెలియజేయనందుకు విసిగిపోయాడని పేర్కొన్నాడు.
అందాల కథానాయిక సోనాక్షి సిన్హా ప్రేమ పెళ్లికి సిద్ధమవుతోంది. తాను ప్రేమించిన సహ నటుడు, ముస్లిమ్ బోయ్ జహీర్ ఇక్భాల్‌ని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది. అయితే సోనాక్షి(హిందువు) పెళ్లిపై తల్లిదండ్రులు సోదరుడు అయిష్ఠంగా ఉన్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రియుడితో పెళ్లికోసం తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబాన్ని సోనాక్షి ఎదురించి ఉండొచ్చని ఆన్ లైన్‌లో డిబేట్ రన్ అవుతోంది.
అయితే సోనాక్షి పెళ్లిపై ఇలాంటి సందేహాలు వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల తనకు తన కుమార్తె సోనాక్షి పెళ్లి ప్రణాళికల గురించి తెలీదు అని తండ్రి శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. అలాగే సోషల్ మీడియాల్లో సోనాక్షిని తన తల్లి పూనమ్ సిన్హా కానీ, సోదరుడు లవ్ సిన్హా కానీ అనుసరించడం లేదు. అన్ ఫాలో చేసారు.
జహీర్‌తో తన పెళ్లికి సంబంధించిన ఆడియో ఆహ్వానం ఇంటర్నెట్‌లో కనిపించినప్పటి నుండి సోనాక్షిపై నే మీడియా ఫోకస్ మళ్లింది. తన తండ్రి .. నటుడు కం నాయకుడు శత్రుఘ్న సిన్హా తన కూతురు వివాహ ప్రణాళికల గురించి తనకు తెలియజేయనందుకు కలత చెందుతున్నారని పుకార్లు వచ్చాయి. ఇంతలోనే సోనాక్షి తల్లి, సోదరుడు సోషల్ మీడియాలో సోనాక్షిని అనుసరించడం లేదని రెడ్డిట్ పోస్ట్ పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో సోనాక్షి తన కుటుంబ సభ్యుల మధ్య అంతా బాగానే ఉందా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒక నెటిజన్ ఇలా వ్యాఖ్యానించారు, ''ఈ పెళ్లి గురించి అమ్మ, సోదరుడు సంతోషంగా లేనట్లు కనిపిస్తోంది. సోదరి పెళ్లి గురించి అడిగినప్పుడు ఈ విషయంలో నా ప్రమేయం లేదని సోదరుడు లవ్ సిన్హా చెప్పారని కథనం వచ్చింది. అయితే ఇది నిజంగా ఉద్దేశపూర్వకంగా ఉంటే విచారకరం.. అని నెటిజనులు విశ్లేషిస్తున్నారు.
అంతకుముందు ఈటీమ్స్‌తో సంభాషణలో జహీర్ ఇక్బాల్‌తో తన సోదరి పెళ్లికి సంబంధించిన కథనాలపై లవ్ సిన్హా స్పందించారు. ఆ సమయంలో అతడు ముంబైలో లేడు. ''నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను. ఈ వార్తలు నిజమైతే వీటితో నాకు ఎటువంటి ప్రమేయం లేదు. నేను వ్యాఖ్యానించలేను'' అని అన్నారు.
అయితే ఇంటర్నెట్‌లోని ఒక విభాగం ఇది 'ఓవర్ అనాలిసిస్' అని నమ్ముతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో-అన్‌ఫాలో గేమ్ ద్వారా తల్లిదండ్రులు తమ అసమ్మతిని చూపుతారని ఆశించలేము.
'హీరామండి ప్రీమియర్‌లో సోనాక్షి తల్లి తనతో కలిసి ఉంది. కాబట్టి ఇటీవలే ఏదైనా జరిగి ఉండవచ్చు.. లేదా మనం అనవసరంగా ఎక్కువగా విశ్లేషిస్తున్నాము అని ఒకరు వ్యాఖ్యానించగా.. సోనాక్షి తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండకపోవచ్చు అని కూడా మరొకరు వ్యాఖ్యానించారు. చాలా మంది తల్లిదండ్రులు ఇన్ స్టాని ఉపయోగించరు. అనవసరమైన ఊహాగానాలు చేయొద్దని ఒక నెటిజన్ రాసారు.
ఇటీవల సోనాక్షి సిన్హా మావయ్య పహ్లాజ్ నిహ్లానీ మాట్లాడుతూ.. సోనాక్షి సిన్హా తన వివాహ ప్రణాళికల గురించి తండ్రి శత్రుఘ్నకు తెలియజేయనందుకు విసిగిపోయాడని పేర్కొన్నాడు. పెళ్లి పుకార్లపై తన మొదటి స్పందనలో శత్రుఘ్న పెళ్లి గురించి తనకు తెలియదని ఒప్పుకున్నారని తెలిపారు. అయితే కూతురిపై కోపం అన్ని వేళలా ఉండదని ప్రేమపెళ్లి వల్ల కొంతకాలం ఇలా అవుతుందని కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. శత్రుఘ్న, నీలం కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారని కూడా గుర్తు చేసాడు. ఒక ముస్లిమ్ యువకుడిని పెళ్లాడాలనే ఛాయిస్ సోనాక్షి సిన్హాకు ఉందని కొలీగ్ స్వరాభాస్కర్ సమర్థించారు. ప్రస్తుతం సెలబ్రిటీ వరల్డ్ లో సోనాక్షి పెళ్లి పెద్ద డిబేట్ గా మారింది.