ఫోటో ఫ్లాష్: స్టార్ హీరోయిన్ గర్భిణి?
కుటుంబ సభ్యులను వ్యతిరేకించి ప్రియుడిని పెళ్లాడిన సోనాక్షి సిన్హాకు చివరికి ప్రేమ పోరాటంలో విజయం వరించింది.
కుటుంబ సభ్యులను వ్యతిరేకించి ప్రియుడిని పెళ్లాడిన సోనాక్షి సిన్హాకు చివరికి ప్రేమ పోరాటంలో విజయం వరించింది. తొలుత బెట్టు చేసిన తండ్రి శత్రుఘ్నసిన్హా బెట్టు వీడారు. ఆయనతో పాటు, కుటుంబ సభ్యుల అండదండలు తనకు దక్కాయి. కుటుంబీకుల సమక్షంలో జహీర్ ఇక్భాల్ తో సోనాక్షి వివాహం ఘనంగా జరిగింది.
సోనాక్షి సిన్హా ప్రస్తుతం తన వివాహ దశను ఎంజాయ్ చేస్తోంది. నూతన వధూవరులు ముంబై నగరంలో కెమెరా ఫ్లాష్ల ముందు మెరుస్తున్నారు. అయితే తాజాగా సోనాక్షి ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ కనిపించింది. కానీ తన వేషధారణ చూసిన వారంతా ప్రెగ్నెంట్! అంటూ ఊహించారు. సోనాక్షి సిన్హా పోల్కా డ్రెస్‌లో కనిపించడం పుకార్లకు దారితీసింది.
ఫిల్మీజ్ఞాన్ షేర్ చేసిన వీడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసే సమయంలో సోనాక్షి - జహీర్ రెస్టారెంట్ నుండి బయటకు వస్తూ కనిపించారు. ఆ సమయంలో జహీర్ స్వయంగా దగ్గరుండి సోనాక్షికి రక్షకుడిగా మారాడు. తన చేయిని పట్టుకుని నడిపించాడు. ఇంతలోనే సోనాక్షి కెమెరామెన్లతో సరదాగా కబుర్లు కూడా చెప్పింది. అందమైన సోనాక్షి పోల్కా డ్రెస్‌లో ఇంకా అందంగా కనిపించింది. ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే అభిమానులు ``ఆమె గర్భవతిగా ఉందా?`` అని ప్రశ్నించారు. అభిమానుల్లో ఒకరు `యే భీ గర్భిణీ హో గై క్యా` అని రాశారు. చాలా మంది నటీమణులు గర్భధారణ సమయంలో పోల్కా దుస్తులు ధరించి కనిపించారు. అనుష్క శర్మ తన మొదటి ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పుడు పోల్కా డాట్ షార్ట్ డ్రెస్‌ని ఎంచుకుంది. అందుకే ఇప్పుడు సోనాక్షి విషయంలో అలాంటి సందేహాలు మొదలయ్యాయి.
ఇటీవల ఈ-టైమ్స్ ఇంటర్వ్యూలో జహీర్‌ను వివాహం చేసుకోవడం ఇంటికి వచ్చినట్లు అనిపించిందని, ఇప్పుడు అతనితో మరింత నాణ్యమైన సమయాన్ని గడపాలని భావిస్తున్నానని సోనాక్షి వెల్లడించింది. తాము ఎప్పుడూ మంచి స్నేహితులమని త్వరగా వివాహం చేసుకోవాలని కోరుకున్నామని పేర్కొన్నారు. సోనాక్షి మాట్లాడుతూ ``నేను చాలా సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని చేసాను. ఇప్పుడు నేను సరిగ్గా ఉండాల్సిన చోటే ఉన్నట్లు భావిస్తున్నాను. చివరకు ఇంటికెళ్లినట్లు అనిపిస్తుంది. నేను జహీర్‌తో సమయం గడపడం ఆనందించాను. మేము నిజంగా మంచి స్నేహితులం. కాబట్టి నేను నా స్వంత వ్యక్తితో ఉండటం.. ఇంటికి తిరిగి వెళ్లి అతడి వద్దకు వెళ్లడం చాలా ఇష్టం. ఇప్పుడు తేలికగా ఉన్నట్టు అనిపిస్తోంది`` అని వ్యాఖ్యానించింది.
వివాహానంతరం ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేసిన నూతన వధూవరులు సోనాక్షి- జహీర్ ఇలా రాశారు, ``ఏడేళ్ల క్రితం (23.06.2017) ఇదే రోజున మేము ఒకరి కళ్లలో ఒకరం ప్రేమను దానిలోని స్వచ్ఛమైన రూపాన్ని చూసాము. ప్రేమికులుగా మారాము. ఈ రోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లు అధిగమించి విజయాల ద్వారా మనకు మార్గనిర్దేశం చేసింది... ఈ క్షణానికి దారితీసింది... మా ఇద్దరి కుటుంబాలు .. మా దేవుళ్లిద్దరి ఆశీర్వాదంతో...మేం ఇప్పుడు భార్యాభర్తలం`` అని ఆనందంగా సోషల్ మీడియాల్లో రాసారు.