మోస్ట్ వైలెంట్ 'ప్యారడైజ్'.. నాని తల్లిగా కనిపించేదెవరు?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్యారడైజ్ మూవీతో రానున్న విషయం తెలిసిందే.;

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్యారడైజ్ మూవీతో రానున్న విషయం తెలిసిందే. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో మూవీ తెరకెక్కుతుండడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మోస్ట్ వైలెంట్ మూవీగా రాబోతుందని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన రా స్టేట్ మెంట్ (వీడియో) మంచి రెస్పాన్స్ అందుకుంది. నాని లుక్ తోపాటు కథంతా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగిపోయాయి. అయితే మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరికొన్ని నెలల్లో మొదలవ్వనుంది.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సినిమాలో నాని తల్లిగా ఎవరు నటిస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మూవీలో హీరో తల్లి రోల్ కు అత్యంత ప్రాధాన్యత ఉందని ఇప్పటికే అర్థమైంది. స్టోరీలో మదర్ సెంటిమెంట్ ను మేకర్స్ బలంగా చూపించబోతున్నారని క్లియర్ గా తెలుస్తోంది.
గ్లింప్స్ లో రక్తం పోసి పెంచిన కొడుకు అంటూ వచ్చిన డైలాగ్ హైలెట్ కూడా అయింది. అదే సమయంలో హీరో తల్లి పాత్ర కాస్త బోల్డ్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఎవరు నటిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణను మేకర్స్ సంప్రదించారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ ఆమె నో చెప్పేశారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇతర ఇండస్ట్రీకి చెందిన యాక్ట్రెస్ ను తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లుక్ టెస్ట్ జరుగుతోందని.. త్వరలోనే ఫైనల్ చేయనున్నారని వినికిడి. అయితే తెలుగు ఆడియన్స్ కు పూర్తిగా పరిచయం లేదని యాక్ట్రెస్ ను తీసుకురావడమే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే టాలీవుడ్ నటి అయితే ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారని.. తర్వాత లేనిపోని విమర్శలు వస్తాయని అంటున్నారు. అయితే మరాఠీ ఇండస్ట్రీకి చెందిన సోనాలి కులకర్ణి.. నాని తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ హిందీ మూవీస్ లో నటించిన ఆమె.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందట. మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.