వరుస రీ రిలీజ్ లతో యువత మది దోచుకుంటున్న మన్మధుడు బ్యూటీ..

ఇప్పటి తరం వారికి సోనాలి బింద్రే అంటే పెద్దగా అవగాహన లేకపోవచ్చు. ఏదో టీవీ లో పాత సినిమాలలో లేక బుల్లితెర షోలలో వచ్చినపుడు మాత్రమే చూస్తారు.

Update: 2024-08-20 06:50 GMT

ఇప్పటి తరం వారికి సోనాలి బింద్రే అంటే పెద్దగా అవగాహన లేకపోవచ్చు. ఏదో టీవీ లో పాత సినిమాలలో లేక బుల్లితెర షోలలో వచ్చినపుడు మాత్రమే చూస్తారు.

కానీ 90 దశకంలో ఆమె స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించింది.అయితే స్టార్ హీరోల పుట్టినరోజులు సందర్భంగా ఒకప్పటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తిరిగి రీ రీలీజ్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. దీంతో సోనాలి బింద్రే మళ్ళీ ఒకసారి బాగా పాపులర్ అవుతుంది.

రీ రిలీజ్‌ల కారణంగా తిరిగి ఒకసారి అందరికీ వింటేజ్ టాలీవుడ్ సినిమాలను చూసి అవకాశం కలుగుతోంది.మరి ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ పిల్లలకు తాము పుట్టక ముందు బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఇంట్లో టీవీ లలో కాకుండా బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం కలుగుతుంది. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ల గురించి కూడా బాగా ఇప్పటివరకు తెలుస్తోంది. ఒకటి బ్లాక్ బస్టర్ సినిమాలోని ఇప్పుడు అభిమానుల సందడి మధ్య స్క్రీన్ పైన చూడడం లో మజా వేరుగా ఉంటుంది.

ఈనెల స్టార్ హీరోల పుట్టినరోజు పుణ్యమా అని సుమారు 4 బ్లాక్ బస్టర్ చిత్రాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాలలో మూడింటిలో సోనాలి బింద్రే హీరోయిన్ కావడం గమనార్హం. మహేష్ బాబు హీరోయిన్ గా మురారి మూవీ లో సోనాలి బింద్రే నటనకు ఇప్పటి కుర్ర కారు కూడా థియేటర్లలో ఫిదా అయిపోయారు.

ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా

ఇంద్ర.. శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలలో సోనాలి బింద్రే హీరోయిన్ కావడం విశేషం.ఇంద్రలో ఐఏఎస్ ఆఫీసర్ కూతురుగా.. శంకర్ దాదా ఎంబిబిఎస్ లో డాక్టర్ సునీత సోనాలి నటన అధ్బుతంగా ఉంటుంది.

మురారి మూవీ రీ రిలీజ్ తర్వాత సోనాలికి యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో రేపు విడుదల కాబోయే ఆమె రెండు చిత్రాల కోసం కొర్ర కారు తెగ ఎదురు చూస్తున్నారు. ఇంద్ర మూవీ కోసం స్పెషల్ బైట్స్ తో పాటు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా సిద్ధమవుతున్నాయట. క్యాన్సర్ లాంటి మహమ్మారితో పోరాడు గెలిచిన సోనాలి.. తిరిగి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తుంది అన్న గాసిప్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా రీ రిలీజ్ చిత్రాలతో ఆమెకు ఫాం ఫాలోయింగ్ పెరగడం మంచిదే కదా అంటున్నారు సినీ విశ్లేషకులు.

Tags:    

Similar News