సోనూసూద్ 'ఫతే' ట్రైలర్ చూశారా?

జనవరి 10న విడుదల కాబోతున్న ఫతేహ్‌ ట్రైలర్‌ సినిమా అంచనాలను పెంచే విధంగా ఉంది.

Update: 2025-01-06 11:35 GMT

టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి గుర్తింపు దక్కించుకున్న నటుడు సోనూసూద్‌. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సోనూసూద్‌ కరోనా సమయంలో చేసిన మంచి పనులతో రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఆయన హీరోగా సినిమాలు వచ్చాయి. నటుడిగా బిజీగా ఉన్న సోనూసూద్‌ దర్శకుడిగా మారి 'ఫతేహ్‌' అనే సినిమాను రూపొందించాడు. ఆ సినిమాలో హీరోగానూ నటించాడు. తాజాగా ఫతేహ్‌ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. జనవరి 10న విడుదల కాబోతున్న ఫతేహ్‌ ట్రైలర్‌ సినిమా అంచనాలను పెంచే విధంగా ఉంది.

మహేష్‌ బాబు ఎక్స్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేయడంతో పాటు సోనూ సూద్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు. యాక్షన్‌ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్‌ చూడ్డానికి చాలా బాగుంది. నా ప్రియమైన స్నేహితుడు సోనూసూద్‌కి ఆల్‌ ది బెస్ట్‌. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు ట్వీట్‌కి సోనూ సూద్‌ స్పందించాడు. లవ్‌ యూ బ్రదర్‌. మనం ఇద్దరం మళ్లీ కలిసి నటించే సమయం కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన దూకుడు సినిమా ఎంతటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో సోనూ సూద్‌ జోరు తగ్గింది.

దర్శకుడిగా సోనూసూద్‌ చేసిన ఈ ప్రయత్నంకు మహేష్‌ బాబు తనవంతు సహకారం అందించడం అభినందనీయం. ఫతేహ్‌ ట్రైలర్‌ చూస్తూంటే ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ మూవీగా అనిపిస్తోంది. ట్రైలర్‌ హింస మరీ ఎక్కువ అయ్యింది అనిపిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలు శృతి మించినట్లుగా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు యాక్షన్‌ సినిమాల ప్రేమికులు మాత్రం ఫతేహ్‌ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నామంటున్నారు. హిందీలో మాత్రమే విడుదల కాబోతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో డబ్‌ చేసి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహేష్‌ బాబు సినిమా విషయానికి వస్తే ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారని ఆ సమయంలోనే వార్తలు వచ్చాయి. అల్యూమీనియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్‌ జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. పూజా కార్యక్రమాలను రాజమౌళి రహస్యంగా ఉంచారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ ఇవ్వడం లేదు. ఎప్పుడు సినిమా గురించి రాజమౌళి రివీల్‌ చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా మహేష్‌ బాబు - రాజమౌళి సినిమా అప్డేట్‌ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.



Full View


Tags:    

Similar News