సుంద‌రం భామ అక్క‌డ చిత‌క్కొడుతుందే!

మ‌ల‌యాళం బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ `అంటే సుంద‌రానికి` తర్వాత వెండ తెర‌పైనే క‌నిపించింది లేదు. టాలీవుడ్ లోనే కాదు సొంత భాష మాలీవుడ్ లోనూ సినిమాలు చేయ‌లేదు.

Update: 2024-12-11 08:30 GMT

మ‌ల‌యాళం బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ `అంటే సుంద‌రానికి` తర్వాత వెండ తెర‌పైనే క‌నిపించింది లేదు. టాలీవుడ్ లోనే కాదు సొంత భాష మాలీవుడ్ లోనూ సినిమాలు చేయ‌లేదు. నాలుగేళ్ల‌గా మాలీవుడ్ కి, రెండేళ్ల‌గా టాలీవుడ్ కి దూరంగానే ఉంది. మ‌ల‌యాళంలో ఛాన్సులు రాక దూరంగా ఉందా? వ‌చ్చినా కావాల‌నే గ్యాప్ తీసుకుందా? అన్న‌ది తెలియ‌దుగానీ..తెలుగులో మాత్రం అవ‌కాశాలు రాలేదు. అయితే తాజాగా అమ్మ‌డు న‌టించిన `సూక్ష్మ‌ద‌ర్శిని` అనే సినిమా రిలీజ్ అయింది.

నాలుగేళ్ల త‌ర్వాత సొంత భాష నుంచి రిలీజ్ అయిన చిత్ర‌మిది. ఎంసీ జితిన్ దర్శకత్వంలో బాసిల్ జోసెఫ్ మరో ప్రధాన పాత్రలో నటించిన చిత్ర‌మిది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చాయి. విమ‌ర్శ‌కులు మెచ్చిన చిత్రంగానే కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సినిమా రీచ్ అయింది. ఈసినిమా వ‌సూళ్లు కూడా భారీగానే రాబ‌డుతుంది. ఇప్ప‌టివ‌కూ వ‌ర‌ల్డ్ వైడ్ గా 50 కోట్ల‌కు పైగా రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

కేర‌ళ‌లో సినిమా రిలీజ్ అయిన థియేట‌ర్ల‌న్నీ హౌస్ పుల్ ర‌న్నింగ్ తో రాణిస్తుంది. ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అంత‌ర్జాతీయంగానూ సినిమాకి మంచి టాక్ వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇత‌ర భాష‌ల్లో కూడా అనువాద‌మ‌య్యే అవ‌కాశం ఉంది. సౌత్ లో మాలీవుడ్ కంటెంట్ కి ఎలాంటి డిమాండ్ ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మాలీవుడ్ సినిమాలంటే జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తున్నారు.

చిన్న సినిమాలా విడుద‌లై పెద్ద విజ‌యాలు సాధించిన చిత్రాల్లో అక్క‌డ కంటెంట్ దే హ‌వా అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. `మంజుమ్మ‌ల్ బోమ్స్` ,` ప్రేమ‌లు` లాంటి సినిమాలు ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన చిత్రాలే. ఇంకా మాలీవుడ్ కంటెంట్ ని టాలీవుడ్ లో రీమేక్ చేయ‌డానికి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు.

Tags:    

Similar News