పిక్‌ టాక్‌ : క్లోజప్‌ లో అందాలతో సోఫి

అందాల ముద్దుగుమ్మ సోఫి చౌదరి క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్, ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2024-09-21 12:30 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులను తన అందంతో మెప్పిస్తున్న ముద్దుగుమ్మ సోఫి చౌదరి. కేవలం హీరోయిన్ గానే కాకుండా టీవీ షో ల ద్వార సైతం సోషి ఆకట్టుకుంటూ ఉంది. మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంటూ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకునే సోఫి చౌదరి మరోసారి అందమైన ఫోటోలను నెట్టింట షేర్‌ చేసింది. ఈసారి క్లోజప్ షాట్ లో సోఫి చౌదరి చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందాల ముద్దుగుమ్మ సోఫి చౌదరి క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్, ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం సోఫి సొంతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

మాంచెస్టర్‌ లో పుట్టి లండన్ లో పెరిగిన సోఫి చౌదరి బ్రిటిష్ గాయనిగా గుర్తింపు దక్కించుకుంది. లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సోఫి చౌదరి చదివింది. సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో ఉండటంతో పాటు హీరోయిన్ గానూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అవ్వడం వల్ల సినిమాల్లో ఆఫర్లు వరుసగా వచ్చాయి. అయితే ఎక్కువ శాతం సోఫి ప్రత్యేక పాత్రలు, పాటల్లో మాత్రమే కనిపించింది. గాయనిగా కూడా సోఫి మంచి పేరు దక్కించుకునేందుకు ప్రయత్నించింది అనడంలో సందేహం లేదు.

 

నటన, గాయిని మాత్రమే కాకుండా భరతనాట్యం లోనూ ట్రైనింగ్‌ తీసుకున్న కారణంగా మంచి డాన్సర్‌ గా గుర్తింపు సొంతం చేసుకుంది. లండన్‌ లో నాలుగు సంవత్సరాల పాటు డాన్స్ లో శిక్షణ తీసుకున్న సోఫి అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పలు సార్లు స్టేజ్ షో లు ఇవ్వడం జరిగింది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం ను నేర్చుకోవడం ద్వారా సింగర్ గా సైతం పలు స్టేజ్ షో లు చేసింది. భారతీయ నటిగా ఈ అమ్మడు 2005 లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి హిందీ సినిమాల్లో నటిస్తూ అభిమానులను సొంతం చేసుకుంది, అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేయడం ద్వారా ప్రేక్షకులను మెప్పించింది.

 

42 ఏళ్ల సోఫి చౌదరి ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. అయినా ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సిరీస్‌ లు, ప్రత్యేక పాటలు, సోషల్‌ మీడియా ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తోంది. టీవీ షో ల్లో హోస్ట్‌ గా, పలు రియాల్టీ షోల్లో కంటెస్టెంట్‌ గా సైతం సోఫి సందడి చేసింది. సాధారణంగా నాలుగు పదుల వయసుకు చాలా మంది ముద్దుగుమ్మలు కనిపించుకుండా పోతారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఇతర హీరోయిన్స్‌ కి తాను విభిన్నం అన్నట్లుగా ఈ ఫోటోలతో చెప్పకనే చెబుతోంది.

Tags:    

Similar News