'ధూమ్-4', 'క్రిష్-4' తో సౌత్ ఇండ‌స్ట్రీ నెగ్గే ఛాన్స్!

ఇప్పుడిప్పుడే వాళ్లంతా సౌత్ మార్కెట్ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

Update: 2024-10-23 16:30 GMT
ధూమ్-4, క్రిష్-4 తో సౌత్ ఇండ‌స్ట్రీ నెగ్గే ఛాన్స్!
  • whatsapp icon

బాలీవుడ్ హీరోలు సౌత్ మార్కెట్లో వీక్. సౌత్ హీరోలు నార్త్ లో క‌నెక్ట్ అవుతున్నారు కానీ..నార్త్ హీరోలు మాత్రం సౌత్ లో క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోతున్నారు. ఆ కార‌ణంగా బాలీవుడ్ హీరోల సినిమాల‌కు సౌత్ లో అనుకున్న స్థాయిలో క‌లెక్ష‌న్లు రావ‌డం లేదు. అప్ప‌ట్లో `దంగ‌ల్`... ఆ త‌ర్వాత `యానిమ‌ల్`, `జ‌వాన్` లాంటి సినిమాలు మాత్ర‌మే మెరుగైన ఫ‌లితాలు సౌత్ నుంచి సాధించాయి. మొత్తంగా చూస్తే చాలా మంది బాలీవుడ్ స్టార్ల‌కు పాన్ ఇండియాలో మార్కెట్ లేదు.

ఇప్పుడిప్పుడే వాళ్లంతా సౌత్ మార్కెట్ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. హైద‌రాబాద్, చెన్నై ,బెంగుళురూ , త్రివేండ్రం, విశాఖ‌ప‌ట్ట‌ణం లాంటి సిటీల్లో ప్ర‌త్య‌కంగా త‌మ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఎవ‌రెంత ప్ర‌మోట్ చేసినా? కంటెంట్ లేనిది క‌ష్టం కాబ‌ట్టి ఆ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోతున్నాయి. అందుకే బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌కంటే సౌత్ డైరెక్ట‌ర్ల‌ను న‌మ్ముకోవ‌డం బెట‌ర్ అని అక్క‌డ హీరోలంతా ఇక్క‌డ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో ఓ రెండు ప్రాంచైజీల‌కు మాత్రం సౌత్ ని సైతం నెగ్గే స‌త్తా ఉంది అన్న‌ది అంతే వాస్త‌వం. అవే `ధూమ్`, `క్రిష్` ప్రాంచైజీలు.

ఇంత వ‌ర‌కూ ధూమ్ నుంచి రిలీజ్ అయిన మూడు భాగాలు ఏ రేంజ్ లో స‌క్సెస్ అయ్యాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ దొంగ‌-పోలీస్ క‌థ‌కి సౌత్ ఆడియ‌న్స్ ఎంతో క‌నెక్ట్ అయ్యారు. జాన్ అబ్ర‌హం నుంచి అమీర్ వ‌ర‌కూ న‌టించిన దొంగ పాత్ర‌ల‌కు ప్రేక్ష‌కులు పెద్ద పీట వేసారు. అలాగే హృతిక్ రోష‌న్ రోష‌న్ న‌టించిన ప్రాంచైజీ క్రిష్ కి కూడా అంతే డిమాండ్ ఉంది. అతీంద్రీయ శ‌క్తులున్న కాన్సెప్ట్ యూనివ‌ర్శ‌ల్ గా క‌నెక్ట్ అయింది. క్రిష్ నుంచి రిలీజ్ అయిన మూడు భాగాలు పాన్ ఇండియాలో మంచి విజ‌యం సాధించాయి.

అలా ఈ రెండు ప్రాంచైజీలకు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్ర‌త్యేక‌మైన అభిమానులు, పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యారు. ఈనేప‌థ్యంలోనే ధూమ్ -4, క్రిష్-4 చిత్రాల్ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసుకుని బ‌రిలోకి దిగుతున్నాయి. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు జ‌రుగుతున్నాయి. కేవ‌లం ఆ ప్రాజెక్ట్ ల్లో హిందీ హీరోల‌నే భాగం చేయ‌కుండా సౌత్ నటుల్ని కూడా తీసుకుని చేయాల‌ని మార్కెట్ పై గురి పెట్టారు. ఇప్ప‌టికే పైలెట్ ప్రాజెక్ట్ గా `వార్ -2` సెట్స్ లో ఉంది. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది స‌క్సెస్ అయితే ధూమ్-4, క్రిష్ -4 స్పాన్ మ‌రింత పెరుగుతుంది.

Tags:    

Similar News