స్పిరిట్‌తో ఆ పెర్ఫార్మెన్స్ చూడాలని వెయిట్ చేస్తున్నా
కల్కి సినిమాతో సూపర్ హిట్ అందుకుని రికార్డులు సృష్టించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
కల్కి సినిమాతో సూపర్ హిట్ అందుకుని రికార్డులు సృష్టించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా వరుస షూటింగులతో బిజీబిజీగా గడుపుతున్నాడు.
ఈ రెండు సినిమాలే ఎప్పుడు పూర్తవుతాయో తెలియకపోతుంటే ప్రభాస్ లైన్ లో మరికొన్ని సినిమాలున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీకి కమిట్ అయిన ప్రభాస్, దాంతో పాటూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2 సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది.
ఈ మూడింటిలో ప్రభాస్ ముందుగా సందీప్ రెడ్డితో స్పిరిట్ సినిమానే ముందు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. యానిమల్ తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించాడు.
స్పిరిట్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయని, అందరితో పాటూ తాను కూడా ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఉగాది పండుగను పురస్కరించుకుని స్పిరిట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలను మొదలుపెట్టనున్నట్టు ఆయన తెలిపాడు.
అంతేకాదు, ప్రభాస్ బాహుబలిలో చేసిన పెర్ఫార్మెన్స్ ఆయన నటించిన తర్వాతి సినిమాల్లో అందరూ మిస్ అయ్యామని, స్పిరిట్ సినిమాతో మళ్లీ అలాంటి పెర్ఫార్మెన్స్ చూడటానికి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. సందీప్ ఒక సీన్ తీయాలంటే దానికోసం ఒకటికి వంద, వెయ్యి సార్లు ఆలోచిస్తాడని ఆయన అలా ఆలోచించడం వల్లే సందీప్ సినిమాల్లో సీన్లు అంత వివరంగా ఉంటాయని, అలాంటి సందీప్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తే అది నెక్ట్స్ లెవెల్ లో ఉండటం పక్కా అని ఆయన తెలిపాడు.