మరో రికార్డ్ క్రియేట్ చేసిన స్క్విడ్ గేమ్ 2

దీనికి సీక్వెల్ గా ‘స్క్విడ్ గేమ్ 2’ సిరీస్ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది.

Update: 2024-12-30 09:59 GMT

కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కరోనా సమయంలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి అపూర్వ ఆదరణ లభించింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ గా ‘స్క్విడ్ గేమ్ 2’ సిరీస్ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ గురించి చాలా రోజులుగా పబ్లిసిటీ చేస్తోంది.

‘స్క్విడ్ గేమ్ 2’ ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ని ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 93 దేశాలలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని దేశాలలో అందుబాటులో ఉన్న మొట్టమొదటి వెబ్ సిరీస్ గా ఇది ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఉన్న ఆదరణ నేపథ్యంలోనే 30+ భాషలలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మొదటి సిరీస్ సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగానే ఓటీటీ రెస్పాన్స్ వస్తోంది. కచ్చితంగా ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లో వ్యూవర్స్ షిప్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు. డబ్బు అవసరం ఉన్న వారిని ఎంపిక చేసి ఒక గేమ్ షోలో పెడతారు.

దాంట్లో ఒక్కో పొజిషన్ దాటుకొని ఫైనల్ కి వెళ్ళాలి. అయితే ఇందులో ఓడిపోయేవారిని చంపేస్తూ ఉంటారు. అలాగే అందులో ప్రమాదకరమైన స్టేజ్ లు ఉంటాయి. ప్రతి క్షణం ఉత్కంఠ కలిగించే విధంగా ఈ ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ ఉంటుంది. అందుకే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ‘స్క్విడ్ గేమ్’ మొదటి సీజన్ తరహాలోనే ఈ సీజన్ 2కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

లాంగ్ రన్ లో ఇది ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ షోలలో ‘స్క్విడ్ గేమ్ 2’ మొదటి స్థానంలో ఉంది. దీనిని బట్టి ఇండియాలో కూడా ఈ సిరీస్ ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని అర్ధమవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 93 దేశాలలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్ అందుబాటులో ఉందంటే అన్ని భాషలలో ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అవుతోందని స్పష్టం అవుతోంది.



Tags:    

Similar News