పింక్ శారీలో పాప అదుర్స్..!
పింక్ శారీ.. స్లీవ్ లెస్ జాకెట్.. లూజ్ హెయిర్ అబ్బా ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా శ్రీలీల లుక్స్ బ్యూటిఫుల్ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
ఇలా వచ్చి అలా రెండు సినిమాలకే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల ధమాకా హిట్ తో సెన్సేషనల్ అనిపించగా ఆ క్రేజ్ తో ఒకేసారి ఐదారు సినిమాల ఆఫర్లు అందుకుంది. ఇంకేముందు ఇక కెరీర్ కు తిరుగులేదని అనిపించగా వరుస ఫ్లాపులు శ్రీలీల గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. ఐతే కథల విషయంలో కాస్త ఆచి తూచి అడుగు వేయాలని తర్వాత తెలుసుకున్న అమ్మడు ఇప్పుడు మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటుంది.
ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ రవితేజాతో మాస్ జాతర సినిమాల్లో నటిస్తుంది శ్రీలీల. ఈ రెండు సినిమాలతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది శ్రీలీల. ఐతే ఆడియన్స్ కు కేవలం సినిమాలతోనే కాదు తన ఫోటో షూట్స్ తో కూడా మంచి ట్రీట్ ఇస్తుంది శ్రీలీల. లేటెస్ట్ గా పింక్ శారీలో శ్రీలీల స్టిల్స్ అదిరిపోయాయి. పింక్ శారీలో అమ్మడి లుక్స్ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయి. శారీలో కూడా ఫోటో షూట్ చేసి ఫాలోవర్స్ ని పిచ్చెక్కిస్తుంది శ్రీలీల.
ఫోటో షూట్ అంటే స్కిన్ షో చేయాలన్న సమీకరణాలు మార్చేస్తుంది అమ్మడు. ఇలా శారీ లుక్స్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. సినిమాలు, ఫోటో షూట్స్ ఇవి రెండు పార్లర్ గా కథానాయికల కెరీర్ ను తీసుకెళ్తాయి. ఒక్కోసారి సినిమాలు ఫ్లాప్ అయ్యి వారి కెరీర్ రిస్క్ లో పడినా కూడా ఈ ఫోటో షూట్స్ వారికి మంచి పాపులారిటీ తెచ్చేలా చేస్తాయి. శ్రీలీల ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది అనిపించేలా ఫోటో షూట్స్ లో కూడా తన స్పెషాలిటీ చూపిస్తుంది అమ్మడు.
పింక్ శారీ.. స్లీవ్ లెస్ జాకెట్.. లూజ్ హెయిర్ అబ్బా ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా శ్రీలీల లుక్స్ బ్యూటిఫుల్ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా సందడి చేస్తున్న ఈ అమ్మడు సినిమాలు కూడా హిట్లు పడితే మాత్రం టాప్ లీగ్ లోకి వచ్చి కొన్నాళ్లు తిరుగులేని విధంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. నితిన్, రవితేజ సినిమాలే కాదు పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఆ సినిమాతో కూడా శ్రీలీల తన సత్తా చాటేలా ఉంది.