స్వాగ్ - రాజరాజచోర కనెక్షన్.. శ్రీవిష్ణు ఏమన్నాడంటే..

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోరు మీద ఉన్నాడు.

Update: 2024-10-03 11:30 GMT

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోరు మీద ఉన్నాడు. గత ఏడాది ‘సామజవరగమన’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఈ ఏడాది ‘ఓం భీమ్ బుష్’ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులకి వినోదాన్ని అందించడమే ధ్యేయంగా శ్రీవిష్ణు కెరియర్ ప్లానింగ్ ఉండటం విశేషం. స్టొరీ ప్లాట్ కొత్తగా ఉండాలి. అదే సమయంలో ప్రేక్షకులు నవ్వుకునే వినోదం పుష్కలంగా ఉండాలని స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

అక్టోబర్ 4న శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘స్వాగ్’ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిఫరెంట్ టైం లైన్స్ లో నడిచే కథగా ఉండబోతోంది. ఇందులో శ్రీవిష్ణు నాలుగు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కథలో కొత్తదనం ఉందనే ఫీలింగ్ జనాల్లోకి బలంగా వెళ్ళింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

హసత్ గోలీ దర్శకత్వంలో శ్రీవిష్ణు దీనికంటే ముందు ‘రాజరాజచొర’ అనే సినిమా చేశాడు. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఆ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోసారి ‘స్వాగ్’ తో డిఫరెంట్ కంటెంట్ ని ప్రేక్షకులకి చూపించాబోతున్నారు. ‘రాజరాజచోర’, ‘స్వాగ్’ మూవీ కథల మధ్యలో ఎక్కడైనా కనెక్షన్ ఉందా అని ఇంటర్వ్యూలో యాంకర్ శ్రీవిష్ణుని ప్రశ్నించారు. మూవీ స్టార్టింగ్ స్టొరీ అనుకునే సమయంలో రెండింటి మధ్యలో కనెక్షన్ ఉండేదని శ్రీవిష్ణు క్లారిటీ ఇచ్చారు.

అయితే స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్న సమయంలో ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేసామని చెప్పారు. అందులో భాగంగా ముందు అనుకున్న లైన్ లో కాకుండా కథని వేరే విధంగా చెప్పాలని ప్రయత్నం చేసినట్లు తెలిపారు. దీంతో ‘రాజరాజచోర’ లింక్ కట్ అయ్యిందని స్పష్టం చేశారు. అయితే ‘స్వాగ్’ సినిమాలో నలుగు క్యారెక్టర్స్ ప్రధానంగా ఉంటాయి. ఈ నాలుగు క్యారెక్టర్స్ కి సంబందించిన బ్యాక్ స్టోరీస్ తో ప్రీక్వెల్స్ చేయొచ్చని శ్రీవిష్ణు పేర్కొన్నారు.

కరెక్ట్ గా రాసుకుంటే మంచి కథలు రెడీ అవుతాయని, అంత బలమైన క్యారెక్టర్స్ ఈ చిత్రంలో ఉన్నాయని స్పష్టం చేశారు. ‘స్వాగ్’ మూవీ సూపర్ హిట్ అయితే మాత్రం కచ్చితంగా సినిమాలోని క్యారెక్టర్స్ కి సంబందించిన బ్యాక్ స్టోరీస్ తో స్వాగ్ ఫ్రాంచైజ్ ని సృష్టించే అవకాశం ఉందని ఆయన మాటల బట్టి అర్ధమవుతోంది. అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News