SV17 టైటిల్ కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు.
టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు. కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ శ్రీ విష్ణు ప్రేక్షకులందర్నీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. గత కొన్ని సినిమాలుగా వరుస హిట్లు అందుకున్న శ్రీ విష్ణు గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో చేతిలో పలు సినిమాలున్నాయి. ప్రస్తుతం శ్రీ విష్ణు ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. శ్రీ విష్ణు కెరీర్లో 17వ సినిమాగా ఇది రూపొందుతుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి కొడుకు కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు డిటెక్టివ్ గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫిబ్రవరి 28న శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు టైటిల్ ను రివీల్ చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.
SV17కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు టైటిల్ ను ఫిబ్రవరి 28 ఉదయం 11.07 గంటలకు రివీల్ చేయనున్నట్టు చిత్ర మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా ఎలా ఉండనుందనేది క్లారిటీ ఇవ్వడానికి గతంలోనే మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేయగా, ఆ వీడియోలో శ్రీవిష్ణు మేకోవర్ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.