SWAG ట్రైలర్.. వారసుడితో అసలు ట్విస్ట్

శ్రీవిష్ణు, రీతువర్మ జోడీగా హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాగ్’ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రాబోతోంది.

Update: 2024-09-30 05:52 GMT

శ్రీవిష్ణు, రీతువర్మ జోడీగా హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాగ్’ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ కథని రెండు టైమ్ లైన్స్ లో చెప్పబోతున్నట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.


1551లో మగవాడి ప్రయాణం నుండి అంటూ ‘స్వాగ్’ ట్రైలర్ స్టార్ట్ చేశారు. అందులో స్వాగనిక వంశ యువరాజుగా శ్రీవిష్ణు క్యారెక్టర్ ని రివీల్ చేశారు. తరువాత స్వాగానిక వంశమట… దేశంలో ఏ మగాడైనా వాళ్లకి మొక్కాల్సిందే అనే డైలాగ్ తో ఆ వంశ చరిత్రని చెప్పారు. తరువాత స్టోరీని ప్రెజెంట్ లోకి తీసుకొచ్చి స్వాగనిక వంశ ఖజానా వారసుడి కోసం వెదకబోతున్నట్లుగా చూపించారు.

ఆపై స్వాగనిక వంశానికి చెందిన వారసుడు ఎక్కడున్నాడో తెలియదు అంటూ అసలు కథలోకి వెళ్లగా అప్పీడే వారసుడిగా ఎంట్రీ ఇవ్వబోయే, ప్రస్తుత కాలం శ్రీవిష్ణుని పరిచయం చేశారు. ఈ డైలాగ్ తర్వాత శ్రీవిష్ణుని డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో రిప్రజెంట్ చేశారు. స్వాగనిక వంశ వారసుడుగా ఎవరికి వారు మేమంటే మేము అని చెప్పుకుంటూ రంగంలోకి దిగబోతున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. ఆపై వింజామర మహారాణి వారసురాలిగా రీతు వర్మ క్యారెక్టర్ ని పరిచయం చేశారు.

సంపద అంతా ఆమెది. కాబట్టి నాకే చెందాలి అంటూ నిధి కోసం రీతు వర్మ రంగంలోకి దిగుతుంది. స్వాగనిక వంశ వారసుడు.. ఆ వారసత్వంతో వచ్చే నిధి.. దాని కోసం వంశ వారసుడిగా ఎవరికి వారు రంగంలోకి దిగడం.. ఈ ట్రైలర్ లో రిప్రజెంట్ చేశారు. నిజమైన వాసరసుడిని ఒక పేదవాడిగా చూపించారు. అతను తన వారసత్వాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటాడనేది ఇంటరెస్టింగ్ గా మూవీలో చెప్పబోతున్నట్లు ట్రైలర్ తో అర్ధమైంది.

ఓవరాల్ గా ‘స్వాగ్’ మూవీ కథాంశం అంతా ఒక నిధి. ఆ నిధికి సంబందించిన స్వాగనిక వారసుడి చుట్టూ తిరగబోతోందని స్పష్టం అవుతోంది. హసత్ గోలి ఈ సినిమా కథని కంప్లీట్ ఫన్ జోనర్ లో చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ లలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ట్రైలర్ తో సినిమా మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయ్యింది. మరోసారి శ్రీవిష్ణు కంప్లీట్ ఫన్ కథతో ఎంటర్టైన్ చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News