లంగా ఓణీలో రాములమ్మ..!

హీరోయిన్ గా చేయాలనే కోరిక ఉన్నా కూడా అందుకు తగ్గ మంచి పాత్రలు ఈ అమ్మడికి దక్కలేదు.

Update: 2024-08-16 19:30 GMT

తెలుగు బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా యాంకర్స్ గా వినోదాన్ని పంచుతున్న వారిలో సుమ ముందు ఉండగా, ఆ తర్వాత స్థానంలో శ్రీముఖి ఉంటుంది అనడంలో సందేహం లేదు. గతంలో ఉదయ భాను అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేది. ఇప్పుడు ఆ స్థాయిలో శ్రీముఖి బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను వివిధ కార్యక్రమాల ద్వారా అలరిస్తూ వస్తుంది. అప్పుడప్పుడు వెండి తెరపై కూడా మెరవడం ద్వారా నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. హీరోయిన్ గా చేయాలనే కోరిక ఉన్నా కూడా అందుకు తగ్గ మంచి పాత్రలు ఈ అమ్మడికి దక్కలేదు.

హీరోయిన్స్‌ సైతం దక్కించుకోలేని మాస్ ఫాలోయింగ్‌ ను, సోషల్‌ మీడియా ఫాలోయింగ్ ను శ్రీముఖి బుల్లి తెర ద్వారా సొంతం చేసుకుంది. హీరోయిన్స్ స్థాయిలో సోషల్‌ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉండటం వల్ల భారీ ఎత్తున ఫాలోవర్స్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇన్ స్టా లో శ్రీముఖి ని ఫాలో అయ్యే వారు దాదాపుగా అయిదు మిలియన్ల మంది ఉన్నారు. చాలా మంది సౌత్ హీరోయిన్స్ కి ఉన్న ఫాలోవర్స్ కంటే కూడా శ్రీముఖి సోషల్‌ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ. అందుకే తన ఫాలోవర్స్ కోసం రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి బుల్లి తెర రాములమ్మ అందమైన లంగా ఓణీ ఫోటోలను షేర్ చేసింది. ఆకట్టుకునే లుక్ లో శ్రీముఖి షేర్‌ చేసిన ఈ ఫోటోలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాములమ్మ ముందు ముందు అయినా సినిమాల్లో బిజీ అవ్వాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ ఔట్ ఫిట్‌ లో రాములమ్మ నిజంగా చాలా అందంగా ఉందని, గతంతో పోల్చితే సన్నగా నాజూకుగా కనిపిస్తుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక శ్రీముఖి బిగ్‌ బాస్ లో కూడా సందడి చేసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అంటూ శ్రీముఖి కి పేరు ఉంది. అంతటి గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖి ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా ఇలాంటి ఫోటోలతో హల్‌ చల్‌ చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు, హీరోయిన్స్ స్థాయి ఎక్స్‌ ప్రెషన్స్ ఇచ్చే శ్రీముఖి లంగా ఓణీ లో భలే ఉందే అంటూ నెటిజన్స్ తో పాటు మీడియా వర్గాల వారు మరియు బుల్లి తెర ప్రేక్షకులు ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News