శ్రీలీలకి టాలీవుడ్ ఇచ్చిన షాకే ఇది!
నటిగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. అడ్వాన్సులు అందుకుని పుల్ ఖుషీ ఉంటుంది.
శ్రీలీలకు టాలీవుడ్ షాక్ ఇచ్చిందా? తాను ఒకటనుకుంటే మరోటి జరుగుతుందా? అంటే అవుననే అనిపిస్తుంది తాజా సన్నివేశాల చూస్తుంటే? పెళ్లి సందడి తో హీరోయిన్ గాపరిచయమైన అమ్మడికి ఆ సినిమా ప్లాప్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంది. నటించిన ఆరు సినిమాల్లో మూడు భారీ విజయాలే సాధించాయి. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం మంచి విజయాలు సాధించనవే. ఇలా బ్లాక్ బస్టర్లు ఉన్న అమ్మడి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
నటిగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. అడ్వాన్సులు అందుకుని పుల్ ఖుషీ ఉంటుంది. 2025 డేట్లు కూడా లాక్ చేసుకుని పెట్టుకుంటుంది. కానీ శ్రీలీల కెరీర్ అలా లేదు. విజయాలున్నా అవకాశాలు రాలేదు. చివరికి ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో పరాయి పరిశ్రమల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడే మిగతా హీరోయిన్లతో శ్రీలీలని పోలిక చేస్తే! ఫెయిలైన భామలే బెటర్ కదా? అన్న ఆలోచన కలుగుతుంది. సరైన విజయాలు లేకపోయినా లావణ్య త్రిపాఠి ఎన్నాళ్లు బండి నెట్టుకొచ్చిందో తెలిసిందే.
వరుణ్ తేజ్ ని వివాహం చేసుకునే వరకూ ఏదో సినిమా చేస్తూనే ఉంది. అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా కూడా ఇలాగే కెరీర్ ని ముందుకు తీసుకెళ్లారు. సక్సెస్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకున్నారు. ఇలా అవకాశాలు ఎలా సాధ్యమైని? ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చినా? దానికి సరైన సమాధానం మాత్రం దొరకలేదు. కానీ శ్రీలీల సక్సెస్ అయినా..ట్యాలెంట్ ఉన్నా? అవకాశాలు రాకపోవడం మాత్రం ఆమె అభిమానుల్ని నిరాశకు గురి చేస్తుంది.
అందులోనూ తెలుగు నేపథ్యం ఉన్న నటికి అవకాశాలు రాకపోవడం పట్ల అభిమానులు వాపోతున్న సన్నివేశం కనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే శ్రీలీలకి టాలీవుడ్ ఇచ్చిన పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి వీటన్నింటిని అధిగమించి ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి. ఇప్పటికే కోలీవుడ్..బాలీవుడ్ పై శ్రీలీల దృష్టి పెట్టింది. హిందీలో ఓ సినిమాలో ఛాన్స్ అందుకుందని ప్రచారం సాగుతోంది. తమిళనాడులో ఓ కాలేజీ ఈవెంట్ కి వెళ్లి మరీ కోలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను? అనే పరిస్థితి శ్రీలీలకి ఎదురైంది.