నాన్న‌కి ఎలాంటి ప్రోత్సాహం ల‌భించ‌లేదు!

ఆయ‌న త‌దానంత‌రం సుత్తివేలు కుటుంబం నుంచి ఎవ‌రూ ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది లేదు.

Update: 2024-10-09 12:30 GMT

తెలుగు తెర‌ న‌వ్వుల సంద‌డి సుత్తివేలు గురించి పరిచ‌యం అవ‌స‌రం లేదు. మూడు ద‌శాబ్దాల పాటు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. హాస్య న‌టుడిగా ప్రేక్ష‌కుల ఆయ‌న వేసిన ముద్ర ఎప్ప‌టికీ చెర‌గ‌న‌ది. న‌ట‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న న‌టుడు. 80-90 ద‌శ‌కంలో సుత్తివేలు లేకుండా సినిమా ఉండేది కాదు. అంత‌గా ఆ కాలంలో ప్రాచుర్యం పొందిన న‌టుడాయ‌న‌. అవార్డులు..రివార్డులు అందుకున్నారు. `ముద్ద మందారం`తో న‌టుడిగా ప‌రిచ‌మ‌య్యారు.

ఆ త‌ర్వాత చివ‌రిగా 2013 లో `రామాచారి` చిత్రంలో న‌టించారు. ఆయ‌న త‌దానంత‌రం సుత్తివేలు కుటుంబం నుంచి ఎవ‌రూ ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది లేదు. అయితే తాజాగా ఓ ఇట‌ర్వ్యూతో సుత్తివేలు కుమార్తె శ్రీదేవి ఆయ‌న గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. `సినిమాలలో అవకాశాల కోసం నాన్న పెద్దగా కష్టాలు పడలేదు. ఆయన నాటకాలలో చేస్తున్నప్పుడు చూసి అవకాశాలు ఇచ్చారు. అప్పటి నుంచి నాన్న వెనుదిరిగి చూసుకోలేదు. చెన్నైలో ఉన్నప్పుడు మాకు దగ్గరలోనే బ్రహ్మానందం గారు , బాబూమోహన్ గారు, రాళ్లపల్లి గారు ఉండేవారు.

తరచూ వాళ్లు మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. షూటింగు లేకపోతే నాన్న ఎక్కువసేపు పూజలో ఉంటారు. పూజ పూర్తయ్యేవరకూ ఏమీ తినేవారు కాదు. ఆ తరువాత పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు. వంటచేయడం అంటే ఆయనకి చాలా సరదా. బయటికి వెళ్లడం చాలా త‌క్కువ‌. ఎక్కువ‌గా ఇంట్లోనే ఉండేవారు. చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కి మారిపోయింది. హైదరాబాదులో నాన్న ఉండటానికి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు.

ఆ కారణంగా ఆయన చెన్నైలోనే ఉండిపోవలసి వచ్చింది. అందువలన ఆయనకి అవకాశాలు కూడా త‌గ్గాయి. అక్క‌డున్నంత కాలం నటుడిగా బిజీగానే కొన‌సాగారు. అలా ఎంతో బిజీగా ఉండే ఆయనకు ఒక్క‌సారిగా పనిలేకుండా ఉండటం వలన మానసిక ఒత్తిడికి గురయ్యారు. అందువల్లనే ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది` అని అన్నారు.

Tags:    

Similar News