హెయిర్ ఊడ‌లేదు కాబ‌ట్టి ఒక్క‌టే స్టైల్!

విగ్గులు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత న‌చ్చిన స్టైల్లో హీరోలు క‌నిపిస్తున్నారు.

Update: 2024-12-23 12:30 GMT

సినిమాల్లో హీరోల హెయిర్ స్టైల్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్కో సినిమాకి ఒక్కో ర‌క‌మైన హెయిర్ స్టైల్లో క‌నిపిస్తుంటారు. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడి సూచ‌న మేర‌కు హెయిర్ స్టైలిస్టులు ర‌క‌ర‌కాల స్టైలిష్ ట్రై చేస్తుంటారు. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయిన హీరోకి రియ‌ల్ గా హెయిర్ లేక‌పోయినా ప‌ర్వాలేదు. ఇంకా చెప్పాలంటే? అలా లేకపోతేనే ర‌క‌ర‌కాల స్టైలిష్ ట్రై చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అడ్వాన్స్ డ్ హెయిర్ ఇంప్లాంటేష‌న్, ప్యాచ్ లు.. విగ్గులు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత న‌చ్చిన స్టైల్లో హీరోలు క‌నిపిస్తున్నారు.

అలా స్టైలిష్ అవ్వ‌డానికే నెలల స‌మ‌యం తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభం కావ‌డానికి ముందే హెయిర్ తో ఎన్నో ప్ర‌యోగాలు చేస్తున్నారు హీరోలు. మ‌రి అలాంటి ప్ర‌యోగాలు చేయ‌ని న‌టుడు ఎవ‌రైనా ఉన్నారా? అంటే నేను ఉన్నానంటూ ముందుకొచ్చారు చార్మింగ్ స్టార్ శ్రీకాంత్. ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ మీరెందుకు హెయిర్ స్టైల్ డిప‌రెంట్ గా ట్రై చేయ‌రు అంటే? హెయిర్ ఊడ‌లేదు కాబ‌ట్టి అన్నారు.

సినిమాల్లోకి వ‌చ్చిన నాటి నుంచి ఒకే ర‌క‌మైన హెయిర్ స్టైల్ తోనే ఎక్కువ‌గా క‌నిపించిన‌ట్లు గుర్తు చేసారు. ఉన్న సొంత హెయిర్ తో మ‌ధ్య పాపిడి లేదా ప‌క్క పాపిడి తీసి హీరోగా మెప్పించిన‌ట్లు చెప్పుకొచ్చారు. కొన్ని సినిమా ల్లో డిఫ‌రెంట్గా ట్రై చేసినా అది సొంత హెయిర్ తో స్టైలిష్ లు అలా తీర్చి దిద్దిన‌ట్లు తెలిపారు. హెయిర్ ఊడిపోతే మాత్రం చాలా ర‌కాల స్టైలిష్ ట్రై చేయెచ్చు అన్నారు.

ఇక న‌టుడిగా ఒకే ర‌క‌మైన పాత్ర‌ల‌కు ఫిక్స్ అవ్వ‌కుండా అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించుకుంటూ వెళ్లాల‌నే వ‌చ్చిన ఏ అవకాశం విడిచి పెట్ట‌లేద‌న్నారు. అలాగ‌ని హీరో పాత్ర‌ల‌కు దూరం కాలేదు. మ‌రో రెండు సినిమాలు హీరోగా రెడీగా ఉన్నాయ‌ని, వాటిని పూర్తి చేయాల‌న్నారు. ఇండ‌స్ట్రీలో తాను ఎవ‌రికీ పోటీ కాద‌ని, త‌న‌కు తానే పోటీగా భావిస్తాన‌ని తెలిపారు.

Tags:    

Similar News